ప‌వ‌న్ వాడాడ‌ని.. మోజుప‌డ్డాడు

తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసినా సూప‌ర్ పాపులారిటీ సంపాదించుకొన్నాడు సుదీప్‌. ఈగ‌తో తెలుగులో ఫేమ‌స్ అయిపోయాడు. తెలుగులో హిట్ట‌యిన సినిమాల‌న్నీ క‌న్న‌డ‌లో రీమేక్ చేస్తూ… అక్కడ స్టార్ క‌థానాయ‌కుడిగా చ‌లామ‌ణీ అవుతున్నాడు. అత్తారింటికి దారేది సినిమాని క‌న్న‌డ‌లో రీమేక్ చేసి సూప‌ర్ హిట్ కొట్టాడు సుదీప్‌. ఇప్పుడు గోపాల గోపాల సినిమాకీ రీమేక్ చేయాల‌నుకొంటున్నాడ‌ట‌. గోపాల గోపాల‌కు మాతృక ఓమైగాడ్ అయినా… ప‌వ‌న్ న‌టించాడు కాబ‌ట్టి గోపాల గోపాల డీవీడీ ముంద‌రెట్టుకొని ఒక‌టికి ప‌దిసార్లు చూసి ప‌వ‌న్ న‌ట‌న‌కు ఫ్యాన్ అయిపోయాడ‌ట సుదీప్‌. అంతేకాదు.. గోపాల గోపాల‌లో ప‌వ‌న్ వాడిన బైకుపై మోజుప‌డి.. దాన్ని ల‌క్ష‌లు పోసి కొన్నాడ‌ట‌.

గోపాల గోపాలలో ప‌వ‌న్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ ఓ బైకు మీద తెర‌కెక్కించారు. ఆ బైకుని ఈ సినిమా కోసం ప్ర‌త్యేకంగా డిజైన్ చేశారు. గోపాల గోపాల షూటింంగ్ అయిపోయినా ఆ బైకుని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఆఫీసులో భద్ర‌ప‌రిచారు. ఇప్పుడు ఆ బైకుపై సుదీప్ మ‌న‌సు ప‌డ్డాడ‌ట‌. సురేష్ బాబుతో బేర‌మాడి సుదీప్ ఆ బైకుని కొనేశాడ‌ని టాక్‌. ఎంత రీమేక్ సినిమా అయినా.. బైకుతో స‌హా అన్నీ కాపీ కొట్టేయాలంటే ఎలా?? కానీ సుదీప్ మాత్రం.. ‘ఇదంతా ప‌వ‌న్‌పై నాకున్న అభిమానం’ అంటున్నాడ‌ట‌. ఎవ‌రి పిచ్చి వాళ్ల‌కానందం మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చైతన్య : ప్రభుత్వం శాశ్వతం.. సీఎం కాదు – ఇంగితం లేదా నాగేశ్వర్ !

ఎంత మేధావులమని చెప్పుకున్నా తాత్కలిక లాభాలో తాము వ్యతిరేకించే వారిని గట్టిగా వ్యతిరేకించాలన్న కురచబుద్దితో వారి ప్రత్యర్థుల్ని సపోర్టు చేసి నవ్వుల పాలవుతూంటారు. ఆ జాబితాలో చాలా కాలంగా ప్రొ.నాగేశ్వర్ కూడా...

కడపలో సీన్ మార్చేస్తున్న షర్మిల !

షర్మిలతో రాజకీయం అంత తేలిక కాదని ఆమె నిరూపిస్తున్నారు. హోంగ్రౌండ్ లో కడప ఎంపీగా గెలిచేందుకు ఆమె చేస్తున్న రాజకీయ వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ చేస్తోంది. రెండు రోజుల...
video

‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్‌: లెక్క‌లు స‌రిచేసే రాబిన్ హుడ్‌

https://www.youtube.com/watch?v=4TriF7BfHyI ప‌వ‌న్ క‌ల్యాణ్ - క్రిష్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు'. ప‌వ‌న్ రాజ‌కీయాలు, ఇత‌ర సినిమాల బిజీ వ‌ల్ల‌... 'వీర‌మ‌ల్లు'కి కావ‌ల్సిన‌న్ని డేట్లు కేటాయించ‌లేక‌పోయాడు. దాంతో ఈ సినిమా పూర్త‌వుతుందా,...

వృద్ధాప్య పెన్షన్ – జగన్‌ను ముంచిన సలహాదారుడెవరు ?

2014లో తాను సీఎం అయ్యే నాటికి రూ. 200 ఉన్న వృద్ధాప్య పెన్షన్ ను అధికారంలోకి రాగానే రూ. వెయ్యి చేశారు. మళ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు రూ....

HOT NEWS

css.php
[X] Close
[X] Close