బాల‌య్య‌తో ‘మెగా’వార్‌

సినిమాల రిలీజ్ విష‌యంలో మ‌న‌వాళ్లు కాస్త ముందు జాగ్ర‌త్త‌తోనే ఆలోచిస్తున్నారు. సీజ‌న్‌ని ఎట్టిప‌రిస్థితుల్లోనూ మిస్ కాకూడ‌ద‌న్న‌ది వాళ్ల ఉద్దేశం. మంచి సీజ‌న్‌లో ఓ యావ‌రేజ్ సినిమా ప‌డినా… లాభాలు తెచ్చుకోవ‌చ్చ‌న్న‌ది వాళ్ల న‌మ్మ‌కం. అందుకే.. సంక్రాంతి, ద‌స‌రా, స‌మ్మ‌ర్‌లాంటి సీజ‌న్ల‌లో తమ సినిమాల వ‌చ్చేలా ప్లాన్ చేసుకొంటున్నారు. దాంతో ఎవ‌రెవ‌రు ఎవ‌రిపై పోటీ దిగుతున్నార‌న్న విష‌యం ముందుగానే అర్థ‌మైపోతోంది. వ‌చ్చే సంక్రాంతికి ఏ హీరోపై, ఏ హీరో త‌న సినిమాని వ‌దులుతున్నాడ‌న్న విష‌యంలో ఇప్పుడే ఓ క్లారిటీ వ‌చ్చేసింది. వ్యూహాల ప్ర‌కారం చూస్తే వ‌చ్చే ముగ్గుల పండ‌క్కి బాల‌య్య‌తో చెర్రీ పోటీ ప‌డ‌బోతున్నాడ‌న్న‌ది టాలీవుడ్ టాక్‌.

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న వందో చిత్రం… గౌతమి పుత్ర శాత‌క‌ర్ణి. క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఈ సినిమాని ఎలాగైనా సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని బాల‌య్య ముందే ఆర్డ‌రు వేశాడ‌ట‌. క్రిష్ కూడా అదే ఆలోచ‌న‌లో ఉన్నాడు. మ‌రోవైపు రామ్‌చ‌ర‌ణ్ కూడా సంక్రాంతి ల‌క్ష్యంతోనే దూసుకుపోతున్నాడు. ప్ర‌స్తుతం త‌నివ‌రువ‌న్ రీమేక్‌లో న‌టిస్తున్నాడు చ‌ర‌ణ్‌. అది పూర్త‌య్యాక సుకుమార్‌తో ఓ సినిమా ఉంటుంది. ఆ సినిమాని సంక్రాంతికి విడుద‌ల చేసేలా.. ప్లాన్ చేస్తున్నాడు. సుక్కుకి కూడా సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. త‌న వ‌న్‌, నాన్న‌కు ప్రేమ‌తో సంక్రాంతికే విడుద‌ల చేశాడు. ఈ సినిమానీ అప్పుడే రిలీజ్ చేయాల‌న్న‌ది త‌న ప్లాన్‌. సో.. బాల‌య్య‌, చ‌ర‌ణ్‌ల మెగా వార్‌… వ‌చ్చే సంక్రాంతికి చూడొచ్చ‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close