బాల‌య్య‌కు షాకిచ్చింది క‌దా…

నంద‌మూరి బాల‌కృష్ణ వందో సినిమా కోసం క‌థానాయిక వేట ఇంకా తెగ‌లేదు. క‌థ రెడీ, ద‌ర్శ‌కుడు రెడీ.. అయితే క‌థానాయిక విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. తొలుత న‌య‌న‌తార‌ని క‌థానాయిక‌గా అనుకొన్నారు. బాల‌య్య కోసం న‌య‌న కూడా జ‌ట్టు క‌ట్ట‌డానికి రెడీనే. కాక‌పోతే… న‌య‌న రెమ్యున‌రేష‌న్ గుర్తొచ్చి కాస్త ఆలోచ‌న‌లో ప‌డింది చిత్ర‌బృందం. న‌య‌న రేటు మ‌రీ రెండు కోట్లు దాటిపోవ‌డంతో… ఆమెకు ప్ర‌త్నామ్యాయంగా మ‌రొక‌రిని ఎంచుకొంటే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న‌కొచ్చారు. ప్ర‌త్యామ్నాయ జాబితాలో కాజ‌ల్ పేరు ప్ర‌ముఖంగా వినిపించింది. ఇప్పుడు కాజ‌ల్‌ని సంప్ర‌దిస్తే… `నాకు ఖాళీ లేదు సారీ..` అంటోంద‌ట‌.

స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ డిజాస్ట‌ర్ మూట‌గ‌ట్టుకొన్న కాజ‌ల్.. ఇప్పుడు బ్ర‌హ్మోత్స‌వంతో బిజీగా ఉంది. అది కాక‌.. ఓ 3 త‌మిళ సినిమాలు చేతిలో ఉన్నాయి. ఒక‌ట్రెండు తెలుగు సినిమాల‌పై సంతకాలు చేసింది. అందుకే ఈ ద‌శ‌లో బాల‌య్య సినిమాకు డేట్లు స‌ర్దుబాటు చేయ‌డం కుద‌రద‌ని చెప్పేసింద‌ట‌. బాల‌య్య సినిమాకే ఖాళీ లేద‌ని నిర్మాత‌ల‌కు షాక్ ఇచ్చింది కాజ‌ల్‌. మ‌రి.. ఇప్పుడు బాల‌య్య కోసం ఎవ‌రిని వెదుకుతారో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close