పాపం..హనుమంతన్న ఆవేదన ఎవరు వింటారు?

కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నేత వి. హనుమంత రావు. అలాగే కాంగ్రెస్ పార్టీకి, దాని అధిష్టాన దేవతలకి వీరవిధేయుడు కూడా. ఒకవిధంగా చెప్పాలంటే ఆయన నిజంగా పేరుకి దగ్గవారే. కానీ ఏనాడూ ఆయనకి కేంద్ర మంత్రి పదవి దక్కలేదు. కేవలం రాజ్యసభ సభ్యత్వంతోనే సరిపెట్టుకోవలసి వస్తోంది. అది కూడా ఈ జూన్ నెలాఖరుతో పూర్తయిపోతుంది. మళ్ళీ పొందే అవకాశాలు కూడా కనబడటం లేదు. అయినా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ పట్ల తన భక్తిని, అభిమానాన్ని కోల్పోలేదు. అనేక దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ ఉత్థాన పతనాలలో దానినే అంటిపెట్టుకొని సాగుతున్నారు. అటువంటి నేతకి ఇప్పటి రాజకీయ నేతల తీరుతెన్నులు, పార్టీ ఫిరాయింపులను జీర్ణించుకోవడం కష్టమే. అదే ఆయన మాటలలో వ్యక్తం అయ్యింది.

ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, పువ్వాడ అజయ్ ఇద్దరూ కాంగ్రెస్ పార్టీని వీడి తెరాసలో చేరడంపై ఆయన స్పందిస్తూ ఇలాగ అన్నారు. “ ఒకప్పుడు రాజకీయ నేతలు దశాబ్దాల తరబడి ఒకే పార్టీని, నేతని నమ్ముకొని ఉండేవారు. కానీ ఇప్పటి నేతలు ప్రొద్దున ఒక పార్టీలో రాత్రి మరొక పార్టీలో కనబడుతున్నారు. పదవులు, అధికారమే ప్రధానం అయిపోయాయి తప్ప పార్టీ, సిద్దాంతాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అనేక పదవులు అనుభవించిన ఫారూక్ హుస్సేన్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోగానే పార్టీని వీడి తెరాసలో చేరిపోవడం చాలా తప్పు. బాధ కలిగిస్తోంది. అలాగే పువ్వాడ అజయ్ కి కాంగ్రెస్ పార్టీ పిలిచి మరీ టికెట్ ఇచ్చి ఆదరిస్తే, ఆయన కూడా తెరాసలో చేరిపోయారు. ఈ విధంగా పదవుల కోసం పార్టీలు మారేవారు నా దృష్టిలో రాజకీయ వ్యభిచారుల క్రిందే లెక్క. పార్టీ మారినప్పుడు కనీసం తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినా గౌరవంగా ఉండేది. కానీ ఇప్పుడు అదీ చేయడం లేదు. ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ వేరే పార్టీలో సభ్యులుగా, మంత్రులుగా నిసిగ్గుగా కోనసాగుతున్నారు,” అని ఆవేదన వ్యక్తం చేసారు హనుమంత రావు.

సమాజంలో తరాల మధ్య జనరేషన్-గ్యాప్ ఏవిధంగా నెలకొని ఉందో అదేవిధంగా రాజకీయాలలో నైతిక విలువల స్థాయిలో చాలా మార్పు వచ్చిందని వర్తమాన రాజకీయాలు నిరూపిస్తున్నట్లున్నాయి. ప్రజా ప్రతినిధులు పార్టీలు మారినా తమ పదవులకు రాజీనామాలు చేయకపోవడం, అయినా స్పీకర్లు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, న్యాయస్థానాలు మందలిస్తున్న స్పీకర్లు, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వంటి అవాంఛనీయ మార్పులు ఇప్పుడు సర్వ సాధారణ విషయాలైపోయాయి. అందుకే హనుమంతన్న అంత ఆవేదన చెందుతున్నారు. కానీ న్యాయస్థానాలనే పట్టించుకొని వారు ఆయన మాటలను ఎవరు వింటారు? అంత ఓపిక, టైం ఎవరికున్నాయి కనుక?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close