మోడీని చూసి తెదేపాయే పొత్తుల కోసం మా వెంట పడింది: భాజపా

ప్రత్యేక హోదా అంశాన్ని ఏపిలో ప్రతిపక్షాలు ఒక బ్రహ్మాస్త్రంగా వాడుకొంటుంటే, అది తెదేపా, భాజపాల మద్య చిచ్చుపెట్టే ముసలంగా మారి వాటి మధ్య చిచ్చు రగులుస్తోంది. ఆ అంశంపై కేంద్రం తన వైఖరి మరో మారు స్పష్టం చేసిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా తెదేపా నేతలు అందరూ కేంద్రంపై విరుచుకు పడటం, ఆ తరువాత యదా ప్రకారం మళ్ళీ వెనక్కి తగ్గినా తరువాత, భాజపా కూడా యదా ప్రకారం తెదేపాపై విమర్శలు చేస్తూ తన వంతు పాత్ర తను చేసింది. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. సురేష్ రెడ్డి, ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య, కార్యదర్శి కోటేశ్వర రావు తదితరులు కలిసి హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, తెదేపాపై చాలా తీవ్రంగా విరుచుకు పడ్డారు.

“నరేంద్ర మోడీ నేతృత్వంలో భాజపా విజయం సాధించి కేంద్రంలో అధికారంలోకి రాబోతోందని పసిగట్టిన చంద్రబాబు నాయుడే పొత్తుల కోసం మా వెంట పడ్డారు తప్ప మేము తెదేపాతో పొత్తుల కోసం ఆరాట పడలేదు. మోడీ, పవన్ కళ్యాణ్ కారణంగానే రాష్ట్రంలో తెదేపా విజయం సాధించింది తప్ప తన స్వశక్తితో కాదు. భాజపా అధికారంలోకి వస్తుందని పసిగట్టినప్పుడు మా పార్టీతో చేతులు కలపడం, ఓడిపోయినప్పుడు మమ్మల్ని వదిలించుకోవడం చంద్రబాబుకి అలవాటే. ఇప్పుడు ఆయన అదే చేసారు.”

“కేంద్రం మంజూరు చేస్తున్న నిధులకు తెదేపా ప్రభుత్వం లెక్కలు చెప్పకుండా, వాటిని దుర్వినియోగం చేస్తోంది. వాటికి లెక్కలు చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిరంతర విద్యుత్ సరఫరా పధకాన్ని అందించడం వలననే రాష్ట్రంలో 10.6 శాతం అభివృద్ధి జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కలే ఆ విషయాన్నీ చెపుతున్నాయి. పోలవరానికి కేంద్రం తగినన్ని నిధులు కేటాయించడం లేదంటూ నిత్యం ఆరోపణలు చేస్తున్న తెదేపా ప్రభుత్వం, పోలవరం అధారిటిని సంప్రదించకుండా రాత్రికి రాత్రే ప్రాజెక్టు అంచనాలను రూ.16వేల కోట్ల నుంచి 30 వేల కోట్లకు పెంచడాన్ని ఏమనుకోవాలి?”

“ఛత్తీస్ ఘర్, గుజరాత్ రాష్ట్రాలలో కేవలం 10-15 ఎకరాలలో రాజధాని నిర్మించుకొంటే, ఆంధ్రప్రదేశ్ రాజధానికి 33,000 ఎకరాలు ఎందుకు సేకరించారు? ఛత్తీస్ ఘర్ రాజధాని నయా రాయ్ పూర్ కోసం గత యూపియే ప్రభుత్వం కేవలం రూ.500 కోట్లు మాత్రమే ఇస్తే, మా ప్రభుత్వం అమరావతి కోసం ఇప్పటివరకు రూ. 1800 కోట్లు ఇచ్చినా ఇంకా సరిపోలేదని చెపుతూ ఏకంగా రూ. 5 లక్షల కోట్లు అడగడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇదివరకు అభివృద్ధి అంతా హైదరాబాద్ లో కేంద్రీకృతం చేసినట్లే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతిలో కేంద్రీకృతం చేస్తున్నారు. ఆ కారణంగా ఉత్తరాంద్ర, రాయలసీమ జిల్లాలలో వేర్పాటు వాదం తలెత్తే ప్రమాదం కనబడుతోంది.”

“కెవిపి రామచంద్ర రావు అనుచరుడికి పట్టిసీమ ప్రాజెక్టు పనుల కాంట్రాక్టుని అప్పగించడం, కెవిపి ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ప్రైవేట్ బిల్లు ప్రవేశ పెట్టడం కూడా కుట్రగానే భావిస్తున్నాము రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎంతగా సహాయం చేస్తున్నా ఏమీ చేయడం లేదని దుష్ప్రచారం చేస్తూ, కేంద్రం పట్ల, రాష్ట్రంలో మా పార్టీ పట్ల ప్రజలలో వ్యతిరేకతను పెంచుతున్నారు. అది మా పార్టీ రాష్ట్రంలో బలపడకుండా ఉండేందుకే చేస్తున్న కుట్ర అని భావిస్తున్నాము.”
“కేంద్రం మంజూరు చేస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తూ, కేంద్ర పధకాలు స్వంత పదకాలుగా ప్రచారం చేసుకొంటూ తెదేపా ప్రభుత్వమే కేంద్రాన్ని మోసం చేస్తోంది. ఇకనయినా దాని తీరు మార్చుకోకుంటే దానితో కలిసి కొనసాగడం కష్టమే,” అని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close