బ‌న్నీ సినిమాల్ని చూడ‌కండి

మెగా హీరోల్ని లెక్క‌తీస్తే అర‌డ‌జ‌నుమందికి పైనే తేల‌తారు. చిరు, ప‌వ‌న్‌, చ‌ర‌ణ్‌, బ‌న్నీ, సాయిధ‌ర‌మ్‌, వ‌రుణ్‌, అల్లు శిరీష్ వీళ్లు చాల‌ద‌న్న‌ట్టు ఇప్పుడు నిహారిక కూడా వ‌స్తోంది. ఆ ఇంట్లోనే నాగ‌బాబు ఉన్నాడాయె. ఇప్పుడు సాయిధ‌ర‌మ్ త‌మ్ముడు కూడా వ‌చ్చేస్తాడ‌ట‌. వీళ్లంంద‌రి ఫ్లాట్ పామ్.. చిరంజీవి ఫ్యాన్సే. ఎవ‌రొచ్చినా చిరంజీవి ఇమేజ్‌ని న‌మ్ముకొని వ‌చ్చిన‌వాళ్లే. ఆ త‌ర‌వాతే సొంత ప్ర‌తిభ చూపించుకొన్నారు. సొంతంగా ఫ్యాన్స్‌ని సంపాదించుకొన్నారు. సెప‌రేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా.. చిరంజీవి అభిమానులే మిగిలిన వాళ్ల‌కు పెద్ద దిక్కు. అయితే ప‌వ‌న్ ఫ్యాన్స్ కూడా.. అదే స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు వాళ్లంద‌రికీ ప‌వ‌న్ త‌ర‌వాతే ఎవ‌రైనా. ప‌వ‌న్‌ని వ్య‌తిరేకంగా చిరంజీవి మాట్లాడినా స‌రే..త‌ట్టుకోలేరు. అలాంటిది బ‌న్నీని వ‌దులుతారా??

ఈమ‌ధ్య స‌రైనోడు ఫంక్ష‌న్ల‌లో అల్లు అర్జున్ మాట‌తీరు ప‌వ‌న్ అభిమానుల్ని బాగా హ‌ర్ట్ చేసింది. ప‌వ‌న్ ప‌వ‌న్ అంటూ అభిమానులు అరుస్తుంటే… ప‌వ‌న్ గురించి మాట్లాడ‌ను అంటూ నిక్క‌చ్చిగా చెప్పేశాడు. చిరంజీవిగారు రోడ్లేస్తే.. కారు వెసుకొని వెళ్లిపోవ‌డం గొప్ప కాదు.. అంటూ ప‌వ‌న్‌ని ఉద్దేశించి ప‌రోక్షంగా మాట్లాడాడు. దాంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ బాగా హ‌ర్ట‌య్యారు. బ‌న్నీపై నిర‌స‌న గ‌ళం విప్పుతూ ఫేస్ బుక్‌లోనూ, వెబ్ సైట్ల‌లోనూ పోస్టింగులు పెడుతున్నారు. ఇప్పుడు బ‌న్నీ సినిమాల్నిచూడ‌కండి. అంటూ అల్టిమేట్టం జారీ చేస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాల్లో ప‌వ‌న్‌కి విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్క‌డి అభిమాన సంఘాలు బ‌న్నీపై గుర్రుగా ఉన్నారు. బ‌న్నీ సినిమాల్ని మేం చూడం… అంటూ బాహాటంగానే చెప్పేస్తున్నారు. ఫ్యాన్స్ ఇలా ముక్క‌లు చెక్క‌ల‌వ్వ‌డం మెగా హీరోల‌కూ ఇష్టం లేదు. దాంతో ఈ విష‌యం జ‌టిలం కాకముందే సున్నితంగా తేల్చుకోవాల‌ని బ‌న్నీ భావిస్తున్నాడ‌ట‌. అందుకు తానేం చేస్తాడో చూడాలి మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎలక్షనీరింగ్ : అంచనాల్ని అందుకోలేకపోయిన వైసీపీ

ఈ సారి ఎన్నికల్లో వైసీపీ డబ్బుల పండగ చేస్తుందని ఓటర్లు ముఖ్యంగా వైసీపీకి చెందిన ఓటర్లు నమ్మకంతో ఉన్నారు. పార్టీ ద్వితీయ శ్రేణి క్యాడర్ కు కూడా రూ....

మోడీ దృష్టిలో జగన్‌ విలువ అంతే !

మోడీకి దత్తపుత్రుడినని అందుకే తాను ఇలా ఉన్నానని జగన్ అనుకుంటూ.. సర్వ అరాచకాలకు పాల్పడ్డారు. కానీ మోడీ దృష్టిలో జగన్ కు గుర్తింపు ఆయన ఓ రాష్ట్ర సీఎం.. తాను...

కేసీఆర్ నాన్ సీరియస్ పాలిటిక్స్ !

పదవిలో ఉన్నప్పుడు.. తన వెనుక బలం, బలగం ఉన్నప్పుడు కేసీఆర్ చెప్పినవి చాలా మందికి బాగానే ఉన్నాయి. కానీ ఆయన సర్వం కోల్పోయాక.. పార్టీ ఉనికే ప్రమాదంలో...

లెట్స్ ఓట్ : బానిసలుగా ఉంటారా ? పాలకులుగానా ?

ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. అంటే ఓట్లేసే మనమే పాలకులం. ఈ మౌలిక సూత్రాన్ని విస్మరించే మన ప్రతినిధులు అంటే.. మనం ఎన్నుకున్న పాలకులు.. తామే మహారాజులం అన్నట్లుగా పెత్తనం చేస్తారు. ఓ మాట...

HOT NEWS

css.php
[X] Close
[X] Close