కాంబినేష‌న్ ఓకే… మ‌రి వ‌ర్క‌వుట్ అయ్యేదెలా?

దిల్‌రాజు నిర్మాత‌గా త్రివిక్ర‌మ్ భారీ చిత్రం – ఈ ఎనౌన్స్‌మెంట్ ఎవ్వ‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌లేదు. దిల్‌రాజుకి ఆ స్టామినా ఉంది. త్రివిక్ర‌మ్‌తోనే కాదు, ఆయ‌న ఏ ద‌ర్శ‌కుడితో అయినా సినిమా చేయ‌గ‌ల‌రు. అయితే.. ఈ కాంబినేష‌న్ వ‌ర్క‌వుట్ అయ్యే ఛాన్సులెంత అన్న‌దే ఇక్క‌డ ప్ర‌శ్నార్థ‌కం. ఎందుకంటే ప్ర‌స్తుతం ఉన్న పరిస్థితుల్లో త్రివిక్ర‌మ్ మూడేళ్ల‌కు రెండు సినిమాలు అన్న పద్ధ‌తిలో కొన‌సాగుతున్నారు. ఈ యేడాదికి సినిమా ముచ్చ‌ట అయిపోయిన‌ట్టే. 2017లో ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాతోనే స‌రిపోతుంది. ఆ త‌ర‌వాత ఆయ‌న‌కంటూ కొన్ని క‌మిట్మెంట్స్ ఉన్నాయి. మ‌హేష్‌బాబుతో ఓ సినిమా చేయాలి. సూర్య‌తోనూ ఓ సినిమా ఉంటుంది. ఆరెండు సినిమాలూ పూర్త‌య్యే స‌రికి మ‌రో మూడేళ్లు పడుతుంది.

ప‌వ‌న్ సినిమాని దిల్‌రాజు ఖాతాలో వేసుకోవ‌డం దాదాపుగా అసాధ్యం. ఎందుకంటే హారిక, హాసిని సంస్థ ముందే క‌ర్చీఫ్ వేసేసింది. ఇక‌.. మ‌హేష్‌బాబు అంటారా? ఆయ‌న ఎంబీ కార్పొరేష‌న్ ఉండ‌నే ఉంది. మ‌హేష్ బాబు చేతిలో చాలామంది ప్రొడ్యూస‌ర్లు అడ్వాన్సులు పెట్టున్నారు. అలాంట‌ప్పుడు ఆ సినిమా దిల్‌రాజు చేతికి చిక్క‌డం అంత తేలికైన విష‌యం కాదు. ఇక సూర్య సినిమాకీ అదే ప‌రిస్థితి. అంటే. దిల్‌రాజు – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ వ‌ర్క‌వుట్ అయ్యే శాతం త‌క్కువ‌గానే ఉంద‌న్న‌మాట‌. కాక‌పోతే ప‌వ‌న్‌తో ఓ సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నాడు దిల్‌రాజు. ఆ విష‌యం ప‌వ‌న్ ముందుకీ తీసుకెళ్లాడు. మంచి క‌థ తీసుకురండి.. అప్పుడు చేద్దాం అని మాటిచ్చాడు ప‌వ‌న్‌. ఆ మాట ప‌ట్టుకొనే.. త్రివిక్ర‌మ్‌ని ఒప్పించ‌డానికి ఇలా ముందే ఓ క‌ర్చీప్ వేశాడ‌న్న‌మాట‌. హారిక హాసిని సంస్థ‌కు త్రివిక్ర‌మ్ హ్యాండిస్తే త‌ప్ప‌.. దిల్ రాజు ప్లాన్ వ‌ర్క‌వుట్ అయ్యే ఛాన్స్ లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close