ఇజం… ఇది నిజం

పూరి జ‌గ‌న్నాథ్ – క‌ల్యాణ్‌రామ్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో క‌ల్యాణ్‌రామ్ రిపోర్ట‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. అందుకే ఈ చిత్రానికి ‘రిపోర్ట‌ర్ బాల‌కృష్ణ’ అనే పేరు పెడ‌తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. ఈసినిమా టైటిల్ కాసేప‌ట్లో ఖ‌రారు కానుంది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రానికి ‘ఇజం’ అనే పేరు డిసైడ్ చేశారు. మ‌రికొద్ది సేప‌ట్లో ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌తో పాటు, టైటిల్‌లోగోని కూడా ఆన్‌లైన్ ద్వారా విడుద‌ల చేయ‌నున్నారు. మంగ‌ళ‌వారం క‌ల్యాణ్ రామ్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఈ చిత్ర విశేషాల్ని తొలిసారి మీడియాతో పంచుకోవ‌డానికి స‌మాయాత్తం అవుతోంది చిత్ర‌బృందం. త్వ‌ర‌లోనే ఇజం టీమ్‌.. స్పెయిన్ వెళ్ల‌నుంది. అక్క‌డ కీల‌క షెడ్యూల్ ప్రారంభం కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close