పేదరికాన్ని అడ్డం పెట్టుకుని హిందూ ఆలయాల్లో వివక్ష చూపిస్తున్నారని దళితుల్ని రెచ్చగొట్టి దశాబ్దాలుగా మత మార్పిళ్లకు పాల్పడుతున్నారు. మతం మారినా కులం అదే ఉంటుందని రిజర్వేషన్లు పోవని నమ్మిస్తూ వచ్చారు. చివరికి ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడి మతం మారిన వారిని కూడా హిందూ ఎస్సీలుగానే పరిగణిస్తూ రిజర్వేషన్లు వర్తింపు చేస్తూ వచ్చారు. కానీ ఏపీ హైకోర్టు తాజాగా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. క్రిస్టియానిటీలో కులభావన లేదు కాబట్టి ఆ మతం తీసుకున్న వారిని హిందూ,ఎస్సీలుగా చూడటం కుదరదని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఇప్పుడు రకరకాలుగా చర్చలకు కారణం అయ్యే అవకాశం ఉంది.
సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది !
మతం మార్చుకున్న వారికి రిజర్వేషన్ల వర్తింపుపై గతంలోనే కీలక తీర్పులు ఇచ్చింది. షెడ్యూల్డ్ కులాల (SC) గుర్తింపు హిందూ మతంతో లేదా సిక్కు, బౌద్ధ మతాలతో ముడిపడి ఉంటుందని తెలిపింది. ల ఒక దళిత వ్యక్తి క్రిస్టియన్ లేదా ఇస్లాం వంటి ఇతర మతాలకు మారితే, వారు SC గుర్తింపును కోల్పోతారని కోర్టు తీర్పుల్లో పేర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ఈ సూత్రం 1950లోని రాజ్యాంగ ఆర్డర్ ఆధారంగా రూపొందింది. SC రిజర్వేషన్లను హిందువులు, సిక్కులు, బౌద్ధులకు వర్తిస్తుంది.మతం మారిన దళితులు తాము కూడా సామాజిక వివక్షను ఎదుర్కొంటామని, అందువల్ల రిజర్వేషన్లు కొనసాగాలని వాదిస్తూ వస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
మత మార్పిళ్లు దేశానికి ప్రమాదకరం
మత మార్పిళ్లు దేశానికి ప్రమాదకరంగా మారాయి. దేశంలోని క్రిస్టియన్ మిషనరీలు చొచ్చుకు వచ్చి పాఠాలు చెప్పి బతుకులు మారుస్తున్నామన్న కారణంగా క్రిస్టియానిటీని పెంచుకుంటూ పోయాయి. ఇప్పుడు దేశంలోనే కాదు.. మరుమూల పల్లెల్లోనే మినిస్ట్రీస్ పేరుతో చర్చిలను నిర్వహిస్తున్నారు. మత మార్పిళ్లే వారి టార్గెట్. వారికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఒక్కొక్కరు భారీ భవనాలు కట్టి మరీ మత మార్పిళ్లకు పాల్పడుతున్నారు. వీరి వల్ల దేశంలో అనేక ఉపద్రవాలు వస్తున్నాయి. ప్రజల్ని మత మౌఢ్యులుగా తయారు చేస్తున్నారు. వీరు ఇలా చేయడంతో.. హిందూత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరంతో ఇతరులకూ తెరపైకి వస్తున్నారు. దీంతో పోటాపోటీగా మత రాజకీయాలు జరుగుతున్నాయి.
ఘర్ వాసపీనే మతం మారిన వారికి రక్షణ
కొన్ని సందర్భాల్లో, మతం మారిన దళితులు తిరిగి హిందూ మతంలోకి మారితే, వారి SC గుర్తింపు పునరుద్ధరించవచ్చని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. 2015 లో ఒక వ్యక్తి క్రిస్టియన్ మతం నుండి హిందూ మతంలోకి తిరిగి మారిన తర్వాత అతని SC గుర్తింపు చెల్లుబాటు అవుతుందని తీర్పు ఇచ్చింది. నిజంగా హిందూ సమాజంలో భాగమైనట్లు నిరూపించాల్సి ఉంటుంది. అంటే మతం మారిన దళితులంతా.. మళ్లీ హిందూత్వంలోకి వస్తే వారికి రిజర్వేషన్లు, ఇతర ప్రయోజనాలు దక్కుతాయి. ఆలయాల్లో వివక్షపై అనే కారణాలన్నీ వాళ్లను మతం మారడానికి చేసిన ప్రచారాలే. మతం మారిన వాళ్లు ఈ విషయం గుర్తిస్తే మేలు.