వైసీపీ మీడియా కొంత మందిని టార్గెట్ చేస్తుంది. వారిపై ఇష్టం వచ్చినట్లుగా కథనాలు రాస్తుంది. అలా టార్గెట్ చేసిన వారిలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఒకరు. ఆమె చికెన్ దుకాణాల దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని కథనాలు రాస్తున్నారు. ఇప్పుడు కాదు.. ఆమె గెలిచినప్పుడు ప్రారంభించారు. ఇప్పటికీ అది పీక్స్ కు చేరుతోంది. ఈ కథనాలపై సైలెంట్ గా ఉండలేని పరిస్థితి ఆమెది. ఈ కథనాలను స్క్రీన్ షాట్లు చూపి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో అఖిలప్రియ కీలక నిర్ణయం తీసుకున్నారు.
తనపై వస్తున్న కథనాలకు ఆధారాలు చూపిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తానని ప్రకటించారు. నా పైన చేసిన ఆరోపణల పై నేను చర్చకు సిద్ధం వైసీపీ సాక్షి వాళ్ళు సిద్ధమవ్వాలని డిమాండ్ చేశారు. అహోబిలంలో అక్రమాల అంతస్తులు అని ఆళ్ళగడ్డ లో నేరాలు గోరాలు జరుగుతున్నట్లు ఆర్టికల్ రాశారని చూపించారు. చికెన్ గురించి రాస్తే నిజాలు ఆళ్ళగడ్డ ప్రజలకు తెలీదా మాకు ఓట్లు వేసినవాళ్ళకు తెలీదా అని ప్రశ్నించారు. అహోబిలంలో కన్ స్ట్రక్షన్ చేయాలి అంటే పంచాయితీ తీర్మానం ఉండాలని..
పంచాయితీ కి సర్పంచ్ వైసీపీ వాళ్ళు ఉన్నపుడు అవినీతి ఎవరు చేస్తున్నట్లు మీరే చెప్పాలన్నారు. ఇప్పుడే అహోబిలం పోదాం ఇల్లీగల్ గా ఎవరు నిర్మించారో అన్ని కూల్చడానికి నేను సిద్ధం సాక్షి కానీ వైసీపీ వాళ్లు రావాలన్నారు.
సాక్షికి ఇప్పుడు తన నిజాయితీని..నిరూపించుకునే అవకాశం వచ్చింది. ప్రెస్ మీట్ పెట్టి ఘోరంగా ఆరోపణలు చేసిన ఎమ్మెల్యేది తప్పు అని నిరూపించి ఎమ్మెల్యేతో రాజీనామా చేయించే అవకాశం వచ్చింది. తమది గాలి పోగేసి రాసే మీడియా కాదని.. బ్లాక్ మెయిల్ కోసం.. తప్పుడు ఆరోపణలు చేసే మీైడియా కాదని నిరూపించే సమయం వచ్చింది. నిరూపించలేకపోతే పరువు పోతుంది. మరి సాక్షి రెడీగా ఉంటుందా?