పహల్గం ఎటాక్ తో ప్రతీకారంగా ఇండియా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో పాక్ కు ముచ్చెమటలు పట్టించింది భారత్. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు ఇప్పుడిప్పుడే సద్దుమనుగుతున్నా ఈ ఆపరేషన్ కొనసాగుతుందని భారత సైన్యం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ కు కొనసాగింపుగా జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల ఎరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కెల్లర్ ను చేపట్టాయి బలగాలు.
ఈ క్రమంలోనే పోషియన్ లోని జెన్ పథర్ లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో కార్డెన్ సెర్చ్ చేపట్టిన సైన్యం…ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ ఎన్ కౌంటర్ లో పహల్గామ్ దాడి వెనక ఉన్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ప్రాక్సీ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ చీఫ్ షాహిద్ కుట్టాయ్ హతమైనట్లు సమాచారం. దీంతో ఆపరేషన్ కెల్లర్ మొదటి ఫలితం వచ్చేసిందని అంటున్నారు.
పహల్గం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేతను సైన్యం మరింత ముమ్మరం చేసింది. చివరి ఉగ్రవాది అంతం అయ్యే వరకు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని చెప్పింది. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా తనిఖీలు ముమ్మరం చేసింది సైన్యం. అనుమానస్పదంగా కనిపించిన వ్యక్తుల కదలికలపై డేగ కన్నేసి ఉంచుతోంది.
పైగా..పహల్గం ఉగ్రదాడిల పాల్గొన్న ఉగ్రవాదుల పోస్టర్లను భద్రత సంస్థలు విడుదల చేశాయి. ఈ ఉగ్రదాడిలో పాల్గొన్నవారిని గుర్తించి సమాచారం అందిస్తే 20 లక్షల బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఈ సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అధికారులు స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే కార్డెన్ సెర్చ్ చేపట్టిన భద్రత బలగాలపైకి పోషియన్ లోని జెన్ పథర్ లో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఎదురుకాల్పులు జరిపిన సైన్యం.. ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు.