కడప మేయర్ సురేశ్ బాబుకు కూటమి ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. మేయర్ గా కొనసాగుతూ నిబంధనలను ఉల్లంఘించారని ఆయనపై అనర్హత వేటు వేసింది. ఈమేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
మున్సిపల్ చట్టాలను ఉల్లంఘించడంతోపాటు సురేశ్ బాబు 36లక్షల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. సురేష్ బాబు కుటుంబ సభ్యులకు కాంట్రాక్ట్ పనులు అప్పగించడం… ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిని అవమానించడంపై మార్చి 24న ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలోనే మంగళవారం మేయర్ ను మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ విచారించారు.
దీనిపై సురెష్ బాబు ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని ప్రభుత్వం ఆయన్ను మేయర్ పదవి నుంచి తొలగించింది. ఇక, ఇప్పటికే ఏడుగురు కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీలో చేరగా.. వారిని సురేశ్ బాబు సస్పెండ్ చేయడంతో తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ఈ క్రమంలోనే సురేష్ బాబుపై అవినీతి ఆరోపణలతోపాటు ,మున్సిపల్ చట్టాలను ఉల్లంఘించడంతో పదవి కోల్పోవాల్సి వచ్చింది.