అల్లు అర్జున్‌తో చేయాల్సిన ప్రాజెక్ట్ ఆలస్యం అవ్వడంతో… వెంకటేష్ సినిమాని పట్టాలెక్కించే పనిలో పడ్డాడు త్రివిక్రమ్. వెంకీ – త్రివిక్రమ్ ఆల్మోస్ట్ ఖాయం. త్వరలోనే ఓ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వస్తుంది. అయితే ఇది సింగిల్ స్టార్ సినిమా కాదని, ఈ సినిమాలో మరో స్టార్ కూడా కనిపించనున్నాడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి వెంకీతో రామ్ చరణ్ కలిసి నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. రామ్ చరణ్ – త్రివిక్రమ్ ల కాంబో కూడా ఎప్పటి నుంచో అనుకొంటున్నదే. కానీ కుదరడం లేదు. సుకుమార్ సినిమా ముగిసిన తరవాత త్రివిక్రమ్ తో ఓ ప్రాజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొన్నారు. అయితే ఆ అవకాశం ఇంకాస్త ముందే వచ్చేట్టు కనిపిస్తోంది.
ప్రస్తుతం ‘పెద్ది’ షూటింగ్ తో బిజీగా ఉంటున్నాడు చరణ్. ఒకవేళ త్రివిక్రమ్ కథ నచ్చితే, డేట్లు ఎలా సర్దుబాటు చేయాలి? గెటప్ ఎలా కంటిన్యూ చేయాలి? అనేదే ప్రస్తుతానికి టాస్క్. ఈ రెండు విషయాల్లోనూ ఓ క్లారిటీ వస్తే, ఈ కాంబో ముందుకు వెళ్లడం ఖాయం. ఈసారి త్రివిక్రమ్ ఓ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ రాసుకొంటున్నాడు. యాక్షన్ పార్ట్ చాలా తక్కువ. కాబట్టి… షూటింగ్ హాయిగా, చాలా వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్ట్ విషయంలో ఓ చిన్న చిక్కు కూడా ఉంది. ఈ సినిమాని సంక్రాంతి బరిలో నిలపాలన్నది త్రివిక్రమ్ ఆలోచన. చరణ్ ఓకే అంటే మాత్రం పొంగల్ కి రావడం కష్టం. ఎందుకంటే 2026 సంక్రాంతి బరిలో చిరంజీవి సినిమా ఉంది. కాబట్టి.. చరణ్ సినిమా పోటీకి దిగడం భావ్యం కాదు. త్రివిక్రమ్ తన సినిమాని 2026 వేసవికి పోస్ట్ పోన్ చేసుకొంటే చరణ్‌కి ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు.