కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని కవిత చెప్పారు.. ఆ దెయ్యాలు ఎవరివో ఒకప్పటి కేసీఆర్ సన్నిహిత మిత్రుడు ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే ప్రకటించారు. ఆ దెయ్యారు కేటీఆర్‌తో పాటు మాజీ ఎంపీ సంతోష్ రావు. వీరిద్దరూ కలిసి కవితకు పార్టీలో ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారు. కేటీఆర్ పూర్తి పట్టు సాధిస్తున్నారు. అదే సమయంలో సంతోష్ రావు పూర్తిగా కేసీఆర్ ను గుప్పిట్లో పెట్టుకున్నారు. అధికారంలో ఉన్న చివరి రెండేళ్లలో కేటీఆర్ కన్నా.. సంతోష్ రావే ఎక్కువ హడావుడి చేశారని ఆర్కే చెబుతున్నారు. ఇటీవలి కాలంలో సరైన రాజకీయ పరిణామం లేక.. ఆసక్తికరమైన కొత్త పలుకుల్ని రాయలేకపోయిన ఆర్కే..ఈ సారి కేసీఆర్ కుటుంబంలో ఏర్పడిన వివాదాలతో మళ్లీ పాత ఫ్లేవర్ ను తన కథనంలోకి తెచ్చే ప్రయత్నం చేశారు.
కానీ షర్మిల వ్యవహారంలో ఆయన బయట పెట్టిన విషయాలు, చెప్పిన అంతర్గత విషయాలు అంత ప్రత్యేకమైన విషయాలు చెప్పలేదు.దాదాపుగా అందరికీ తెలిసిన విషయాలనే చెప్పారు. అయితే హరీష్ రావు పార్టీ మారాలనుకున్న విషయాన్ని మాత్రం కొత్తగా చెప్పారు. భారతీయ జనతా పార్టీ నుంచి హరీష్ రావుకు తిరుగులేని ఆఫర్లు రావడంతో .. హరీష్ రావు మనసు ఊగిసలాడింది. అయితే కేటీఆర్ వెంటనే ఆయన ఇంటికి వెళ్లి రాజీ చేసుకున్నారు. ఫలితంగా కేసీఆర్ నుంచి ఆయనకు రెండు, మూడు సార్లు పిలుపు వచ్చింది. ఫామ్ హౌస్ తలుపులు తెరుచుకున్నాయి. వెళ్లి మాట్లాడి వచ్చారు. దాంతో ఇప్పటికి హరీష్ రావు సర్దుకున్నారు.
కవిత వ్యవహారం ఇప్పుడల్లా సద్దుమణిగే అవకాశం లేదని.. ఆమె బయటకు వెళ్లిపోయే వరకూ సాగుతుందని ఆర్కే విశ్లేషణ. ఈ మొత్తం వ్యవహారంలో కేసీఆర్ ఏమనుకున్నా.. బయటకు ఆయన ఏం సందేశం పంపుతారన్నది కీలకం. ఇంకా కుమార్తె వ్యవహారంపై ఏమీ మాట్లాడలేదు. సూచనలు కూడా పంపలేదు. కానీ ఆర్కే కవిత బయటకు వెళ్తే విజయవంతం కాలేరని మాత్రం పరోక్షంగా చెప్పారు. ఇప్పుడు ఎయిర్ పోర్టు వద్దకు వచ్చిన వాళ్లు కూడా ఆమె బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తే ఎవరూ రారని ఆయన కవితకు సందేశం పంపించారు. ల
బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలు మరింత జోరందుకోనున్నాయి. ఒకప్పుడు కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన ఆర్కే.. ఆ కుటుంబానికి అధికార పదవులు దక్కని తర్వాత దూరమయ్యారు. కేటీఆర్, కవిత చాలా సార్లు పరువు నష్టం కేసులు వేస్తామని హెచ్చరించారు. కేసీఆర్ అయితే మీడియా సంస్థల్ని బ్యాన్ చేశారు. ఇప్పుడు ఆర్కేకు.. ఆ కుటుంబ కథా చిత్రాన్ని రసవత్తంగా ప్రజల ముందు ఉంచే అవకాశం దక్కించుకున్నారు.