మంత్రి పదవి కోసం తెలంగాణ ఎమ్మెల్యేల్లో ఎంత పెద్ద రేస్ జరిగిందో అందరూ చూశారు. శాక ఏదైనా సరే.. పదవి కావాలని పట్టుబడుతున్న వారు .. బలమైన నేతలు ఉన్నారు. అయితే సామాజిక సమీకరణాల్లో భాగంగా తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచినా పదవి దక్కించుకున్న వాకిటి శ్రీహరికి మాత్రం సంతృప్తి లేకుండా పోయింది. తన శాఖలు గందరగోళంగా ఉన్నాయని ఆయనంటున్నారు. ఐదు శాఖలు ఇచ్చారని అన్నీ అలాగే ఉన్నాయని ఆయన కంగారు పడిపోతున్నారు.
వాకిటి శ్రీహరికి సీఎం రేవంత్ ఐదు శాఖలు ఇచ్చారు. పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ,క్రీడలు, యువజన సర్వీసుల శాఖల మంత్రిగా ఉన్నారు. అయితే ఏ శాఖలోనూ ఆయన సరైన రీతిలో వ్యవహరించలేకపోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే చెప్పుకున్నారు. తన అదృష్టమో..దురదృష్టమో తెలియడం లేదంటున్నారు. ఈ శాఖలు గందరగోళంగా ఉన్నాయని, యువజన సర్వీసులు వంటి శాఖలతో తనకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు.
ఆయన మంత్రి పదవి వచ్చిన తర్వాతనే ఎక్కువగా అసంతృప్తికి గురవుతున్నారని ఆయన మాటల ద్వారా తెలుస్తోంది. సాధారణంగా మమంత్రులు.. తన శాఖల మీద పట్టు సాధించాలంటే…మాట వినే అధికారుల్ని పెట్టుకుంటారు. తనకు శాఖపై అవగాహన లేదనుకుంటే.. అన్నీ తానై నడిపించే అధికారులతో పనులు చేయించేసి.. మెరుగైన ఫలితాలు వస్తే తన పేరు చెప్పుకుంటారు. కానీ ఇక్కడ శ్రీహరి.. పదవి వచ్చినా.. తన శాఖల్లో గందరగోళం ఉందని అంటున్నారు. ఉపయోగపడటం అంటే ఏమిటో కానీ.. శ్రీహరి మాత్రం సంతృప్తి పడలేకపోతున్నారు.