నెల్లూరు రాజకీయాల్లో నల్లపురెడ్డి కుటుంబానికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి హుందా రాజకీయాలు నడిపారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కుమారుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తండ్రికి ఉన్న గౌరవాన్ని నేలమట్టం చేసేస్తున్నారు. అందరూ అసహ్యించుకునేలా మాట్లాడుతున్నారు. పది మంది ముందు మాట్లాడుతున్నామన్న స్పృహ కూడా ఆయనకు ఉండటం లేదు.
హవ్వ.. మహిళా ఎమ్మెల్యేపై ఇలా మాట్లాడతారా?
కోవూరు నియోజకవర్గ వైసీపీ సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడారు. ఆయన ప్రసంగం అంతా.. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వ్యక్తిత్వం పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటంతోనే సాగిపోయింది. అత్యంత ఘోరంగా.. నీచంగా.. ఓ మహిళ గురించి అనకూడని మాటలన్నీ అన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరుకుంటే ముక్కుపచ్చలారని అమ్మాయిని తెచ్చి పెళ్లి చేస్తాడట ప్రసన్నకుమార్ రెడ్డి. ఎమ్మెల్యే క్యారెక్టర్ గురించి చెప్పకూడని విధంగా మాట్లాడారు. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది.
నల్లపురెడ్డి ఇంటిని ధ్వంసం చేసిన దుండగులు
ఈ మాటలు మాట్లాడిన కాసేపటికి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిని కొంత మంది ధ్వంసం చేశారు. పూర్తి స్థాయిలో ఫర్నీచర్ సహా విరగగొట్టారు. ఇంటి ఆవరణలో ఉన్న బెంజ్ కారుపైనా దాడి చేసి…తిరగబడేశారు. ఆ సమయంలో ప్రసన్నకుమార్ రెడ్డి ఇంట్లో లేరు. ఇది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనుచరులే చేసి ఉంటారని భావిస్తున్నారు. నల్లపురెడ్డి ఓ మహిళ వ్యక్తిత్వంపై ఇంత ఘోరంగా దాడి చేసిన తర్వాత ఏ చట్టం ప్రకారం ఆయనను శిక్షిస్తారో తెలియదు కానీ.. వీటిని ఇలా వదిలేస్తే మాత్రం.. ఆయన మరింతగా రెచ్చిపోతారు.
మహిళల వ్యక్తిత్వంపై దాడి చేయడమే వైసీపీ విధానం
వైసీపీ బూతు పార్టీ. ఆ పార్టీ నాయకులు ఆడవాళ్లకు విలువ ఇవ్వరు. అత్యంత ఘోరంగా మానసికంగా వేధించేందుకు ప్రయత్నిస్తారు. ఆ వ్యూహంలోనే నల్లపురెడ్డి చెలరేగిపోయారు. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు. ఎన్నికల సమయంలోనూ క్యారెక్టర్ ను కించపరిచేలా చేశాడు. దాంతో తన జీవితం గురించి ప్రజలకు ప్రశాంతిరెడ్డి వివరణ ఇచ్చారు. ఆమె మొదట నల్లపురెడ్డి ఇంటికే కోడలిగా వెళ్లారు. కానీ భర్త చనిపోవడంతో వేమిరెడ్డిని పెళ్లి చేసుకున్నారు. తమ కుటుంబంలోని మహిళే అయినా తన రాజకీయ పదవికి అడ్డం వచ్చారని.. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు ప్రసన్న కుమార్ రెడ్డి.
అధికారం కోల్పోయినా ఇలాంటి మాటలు .. చేతలు మానుకోని వైసీపీ నేతలకు ప్రజలు ఇన్ స్టంట్‌గానే కాదు..ఎన్నికలలోనూ ఎన్ని సార్లు అయినా బుద్ది చెబుతారన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.