జగన్ రెడ్డి తోతాపురి షో ఎంత పక్కా ప్లానింగ్ స్క్రిప్టో పోలీసులు చాలా స్పష్టంగా బయటపెట్టారు. జగన్ రెడ్డి ప్రతీ పర్యటనలో రచ్చచేస్తూండటంతో ఈ సారి ప్రతి కదలికను డ్రోన్ ద్వారా నిఘా పెట్టారు. ఎక్కడెక్కడ ఎలాంటి వేషాలు వేయబోతున్నారో కనిపెట్టి.. .ఆ దృశ్యాలను రికార్డు చేశారు. అందులో మొదటిది.. రోడ్డుపై మామిడికాయలు పారబోయడం. ఈ స్కిట్ కోసం .. ఐదు ట్రాక్టర్ల మామిడియా కాయలు ముందుగానే రెడీ చేసి.. జగన్ వచ్చేదారిలోని ఓ పొలంలో రెడీగా ఉంచారు.
జగన్ వచ్చే ముందు వాటిని రోడ్డుపై పారబోసి తొక్కించారు. రైతులు పారబోస్తున్నట్లుగా వాటిని ప్రచారం చేశారు. కానీ పోలీసులు ఎక్కడ దాచి పెట్టారు.. ఎక్కడ పారబోశారు..అన్నది మొత్తం వీడియోలు తీశారు. ఆ మామిడి కాయలు ఎవరివి. ఎక్కడ కొన్నారు.. ఆ ట్రాక్టర్ డ్రైవర్లు ఎవరు అన్నది మొత్తం తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు. వారంతా వైసీపీకి చెందినవారే. తమకు డబ్బులు ఇస్తామంటే .. రోడ్లపై మామిడిని పారబోశామని ట్రాక్టర్ డ్రైవర్లు చెప్పారు. అలాగే తమ కార్యకర్తను పోలీసులు కొట్టారంటూ.. ఓ చోట జగన్ రెడ్డి పెద్ద స్కిట్ వేయబోయారు. కానీ వైసీపీ కార్యకర్తను పోలీసులు కొట్టలేదని.. వైసీపీ కార్యకర్తల తోపులాటలోనే చిన్న గాయం అయిందని తేల్చారు. దీనికే జగన్ రెడ్డి పెద్ద పెద్ద డైలాగులు పేల్చారు.
ఇక డీఎస్పీని రప్పా రప్పా నరుకుతామన్న వీడియోను కూడా పోలీసులు చాలా పక్కాగా రికార్డు చేశారు. మొత్తం జగన్ పర్యటనను పోలీసులు డ్రోన్లలో రికార్డు చేశారు. జగన్ రెడ్డి చేసిన స్కిట్.. అసలు డ్రామా.. నేరాలకు పాల్పడిన వారందరిపై కేసులు పెట్టి అరెస్టు చేయనున్నారు. పోలీసులు వేసిన స్కెచ్ తో.. జగన్ రెడ్డి స్కిట్ తేలిపోయింది. ఆయన కార్యకర్తలు కేసుల పాలవుతున్నారు.