ప్రఖ్యాత నటి బెంగళూరు సరోజాదేవి (87) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో సోమవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. హొన్నప్ప భాగవతార్ నిర్మించిన మహాకవి కాళిదాస అనే కన్నడ సినిమాతో ఈమె సినిమా రంగంలో ప్రవేశించారు
తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో నటించిన సరోజా దేవి… ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్ల వంటి వెటరన్స్ పలు సూపర్ హిట్ సినిమాల్లో అలరించారు. 1955 నుంచి 1984 వరకు 29 ఏళ్లలో వరుసగా 161 సినిమాల్లో హీరోయిన్గా నటించి ఏకైక భారత నటిగా ఘనత సాధించారు.
1969లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ అందించింది. బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్, తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి అవార్డు కూడా అందుకున్నారు. అభినయ సరస్వతి, కన్నడతు పైంగిలి బిరుదులు సొంతం చేసుకున్నారు. సరోజాదేవి మరణంతో ఓ శకం ముగిసినట్లయింది.