ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కాం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. సీఐడీ సిట్ దాఖలు చేసిన ప్రాథమిక చార్జిషీట్లో జగన్ పేరు పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది. ఇరవై రోజుల్లో దాఖలుచేయనున్న మరో చార్జిషీటులో జగన్ రోల్ మొత్తాన్ని ప్రజల ముందు పెట్టనున్నారు. అందులో ప్రజలు గట్టిగా నమ్ముతున్న నిజాలను సాక్ష్యాలతో సహా వెల్లడించే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలోనే చాలా విషయాలు వెలుగులోకి వస్తాయి.
బహిరంగంగా జరిగిన దోపిడీ ..లిక్కర్ స్కాం
ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కాం జరగలేదని ఒక్కరంటే ఒక్కరు నమ్మరు. కళ్ల ఎదుట జరిగిన బహిరంగదోపిడి అది. ఒక్కటంటే ఒక్క పాపులర్ బ్రాండ్ ఏపీలో అమ్మలేదు.ఆ బ్రాండ్ల పేరుతో ఇమిటేషన్ బ్రాండ్లను అమ్మారు. కల్తీ మద్యాన్ని అమ్మారు. అంతేనా.. రేట్లు పెంచి ప్రజల రక్త మాంసాలు తాగారు. ఆ పెరిగిన రేట్లతో మద్యం అలవాటు ఉన్న కుటుంబాలు ఆర్థికంగా దివాలా తీసేశాయి. రోజంతా పని చేసుకున్నా.. మద్యానికే సగం పెట్టాల్సి వచ్చేది. ఇంత రేట్లు ఎందుకు పెట్టారంటే.. క్రమంగా మద్యనిషేధం చేయడానికి.. కానీ చేయకుండా దోపిడీ చేశారు. అంతా ప్రణాళికా బద్ధంగా చేశారు.
అంతా జగన్ ప్లానే
లిక్కర్ స్కామ్ ఎలా చేయాలో.. ఎలా డబ్బులు పిండుకోవాలో.. అసలు ప్లాన్ అంతా జగన్ రెడ్డిదేనని వైసీపీలో.. నాడు ప్రభుత్వంలో ఉన్న అందరికీ తెలుసు. ప్రతి దేశలో ఆయన ఇచ్చిన సూచనల ప్రకారమే నిర్ణయాలు జరిగాయి. మనీ లాండరింగ్ కూడా జగన్ సూచనలు,సలహాలతోనే జరిగిపోయేది. అవినీతి వ్యవహారాల్లో పక్కా మాస్టర్ మైండ్ అయిన జగన్ ఈ స్కామ్ ను పక్కాగా డీల్ చేశారు. వందల మందిని పావుగా వాడుకున్నారు. ఇప్పుడు వారందరూ దొరికినా.. తాను తప్పించుకోగలనని జగన్ రెడ్డి అనుకుంటున్నారు. అది సాధ్యం కాదని సిట్ సాధికారికంగా చేస్తున్న దర్యాప్తులో స్పష్టమవుతోంది.
16 నెలలు జైల్లో ఉన్నా మార్పు రాకపోవడం వల్లే
జగన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా చేసిన దోపిడీల కారణంగా పదహారు నెలల పాటు జైల్లో ఉన్నారు. ఆ కేసులన్నీ సీబీఐ, ఈడీకోర్టుల్లో ఉన్నాయి. వాటిపై విచారణ జరగకుండా న్యాయస్థానాల్లో పిటిషన్లు వేసి అడ్డుకుంటున్నారు. కోర్టులను కూడా పని చేయకుండా చేస్తున్నారు. అప్పట్లో జైల్లో ఉన్నా మరోసారి తప్పు చేయాలంటే భయపడలేదు. ఈ సారి నేరుగా తన చేతికి ప్రజలు అధికారం ఇచ్చే సరికి వారి రక్త మాంసాలను దోపిడీ చేశారు. ఇలాంటి వారిని వ్యవస్థలు ఏ మాత్రం ఉపేక్షించినా అది ప్రజలకు.. ప్రజాస్వామ్యానికే చేటు జరుగుతుదంని అనుకోవచ్చు.