పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా చాలా ప్రతిష్టాత్మకంగా మొదలైంది. పవన్ చేస్తున్న తొలి పీరియాడిక్ సినిమా, అలాగే ఆయన హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో చేస్తున్న తొలి సినిమా కూడా ఇదే. పాన్ ఇండియా రేంజ్లో ప్లాన్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్‌కి ఉన్న పొలిటికల్ షెడ్యూల్, నిర్మాణ పరంగా వచ్చిన కొన్ని అవాంతరాలు కారణంగా చాలా కాలం పాటు ఈ సినిమా ప్రొడక్షన్లోనే ఉండిపోయింది. మధ్యలో దర్శకుడు కక్రిష్ తప్పుకున్నారు. సినిమా పూర్తి అయిన తర్వాత కూడా ఒక మూడు సార్లు వాయిదా పడింది. దీంతో సహజంగానే సినిమా చుట్టూ ఉన్న బజ్ సన్నగిల్లింది. అయితే ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ చేశారో అప్పటి నుంచి సినిమాపై మళ్లీ హైప్ క్రియేట్ అయింది. వీటన్నిటికీ మించి పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనడం అనేది మరింత బూస్ట్ప్ ఇచ్చింది.
నిజానికి పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్‌కి వస్తారా లేదా అనే ఒక అనుమానం ఉండేది. ఎందుకంటే బేసిగ్గా ఆయన సినిమాలను ప్రమోట్ చేసుకోరు. ప్రెస్మీట్లు పెట్టి సినిమా ఇంత గొప్పగా ఉంది, అంత గొప్పగా తీశామని చెప్పుకునే తత్వం కాదు. బిగినింగ్ నుంచి అంతే. మహా అయితే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వస్తారు. అప్పుడు కూడా సినిమా గురించి గొప్పగా చెప్పడం ఏమీ ఉండదు. జస్ట్ అందరికీ థాంక్స్ చెప్పి అభిమానులను పలకరించి వెళ్లిపోతారు. కానీ హరిహర వీరమల్లు సినిమా పరిస్థితి వేరు. కచ్చితంగా సినిమాపై బజ్ క్రియేట్ అవ్వాలి. ఆ బజ్‌ను కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే క్రియేట్ చేయగలరు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే చేశారు. ఒకేరోజులో ఒక ప్రెస్‌మీట్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరవ్వడం అనేది బహుశా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఫస్ట్ టైం. నిజానికి ఆయన ప్రెస్ ముందుకు వస్తారని ఎవరు ఊహించలేదు. ఆయన ఇప్పుడు కేవలం హీరోనే కాదు, ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. ఆయన సమయం చాలా విలువైనది. కానీ అంత విలువైన సమయాన్ని కూడా ఒక ప్రెస్‌మీట్, ఒక ఈవెంట్‌కి కేటాయించడం అనేది చాలా విశేషంగా చెప్పుకోవాలి.
పవన్ కళ్యాణ్ రాకతో ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. అలాగే సినిమా గురించి ఆయన చెబుతున్న తీరు కూడా బావుంది. మామూలు సినిమా కాదు ఇది. చరిత్రను తీయడం అంటే రీక్రియేషన్ చాలా టఫ్. ఆ కష్టాన్ని పవన్ కళ్యాణ్ చాలా వివరంగా చెబుతున్నారు. ఇది సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. అలాగే ఆయన ఇంటర్వ్యూలు ఇస్తానంటున్నారు. అది కూడా చాలా మంచి పరిణామం. ఇవన్నీ కూడా ఓపెనింగ్స్, ప్రీమియర్ షోల మీద మంచి ప్రభావం చూపిస్తాయి. రెట్టించిన ఉత్సాహంతో అభిమానులు సినిమాను చూడడానికి రావడం ఖాయం.
ఇప్పుడు వీరమల్లు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ టికెట్ల హైక్స్ వచ్చాయి. పవన్ హుషారుగా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. మొత్తానికి నిర్మాత ఏ.ఎం. రత్నంకు ఇది చాలా పెద్ద ఉపశమనం. పవన్ అన్ని విధాలుగా అండగా నిలబడం అభినందనీయం.