కడప స్టీల్ ప్లాంట్ అంశం నెమ్మదిగా ముందుకు వస్తోంది. జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 4,500 కోట్లు పెట్టుబడి పెట్టాలని బడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1,100 ఎకరాల భూమిని ఎకరాకు 5 లక్షల చొప్పున కేటాయించింది, మొత్తం 3,500 ఎకరాలలో ప్లాంట్ నిర్మాణం జరుగుతుంది. ప్లాంట్ కు అవసరమైన నీరు, విద్యుత్ సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోంది.
డిసెంబర్ 2022లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ JSW స్టీల్ లిమిటెడ్‌తో పెట్టుబడి ఒప్పందానికి ఆమోదం తెలిపింది. కానీ తర్వాత ముందడుగు పడలేదు. కూటమి ప్రభుత్వం రాకతో నిర్మాణ పనులు ముమ్మరమయ్యాయి. JSW మరియు ప్రభుత్వ అధికారులు సున్నపురాళ్లపల్లెలో సర్వే నిర్వహించారు.
ఈ ప్లాంట్ ప్రపంచంలోనే అత్యంత పర్యావరణ అనుకూల స్టీల్ ప్లాంట్‌గా నిర్మిస్తామని సజ్జన్ జిందాల్ చెబుతున్నారు.
అయిత ఇప్పుడు మరోసారి ఆ ప్లాంట్ కు శంకుస్థాపన చేస్తారా లేదా పనులు ప్రారంభిస్తారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఎదుకంటే కడపలో ఓ సారి చంద్రబాబు, రెండు సార్లు జగన్ స్టీల్ ప్లాంట్ కోసం శంకుస్థాపనలు చేశారు. ఇప్పుడు శంకుస్థాపనలు చేయడం కన్నా.. సైలెంటుగా గా పనులు ప్రారంభిస్తే.. ప్రజలు కాస్త ట్రోల్ చేయకుండా ఉంటారు. మరోసారి శంకుస్థాపన చేస్తే మాత్రం అదో పెద్ద ట్రోల్ ఇష్యూ అయిపోతుంది.