ఎన్నికల సంఘం భారీగా అక్రమాలకు పాల్పడిందని, తన దగ్గర అణుబాంబులాంటి ఆధారాలున్నాయని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు. ఆధాలుంటే ప్రకటించుకండా.. దాచుకుంటున్నారా అని బీజేపీ సెటైర్లు వేసింది అది వేరే విషయం. కానీ రాహుల్ గాంధీ ప్రకటన విధాన పరంగా ఈసీ పని తీరును ప్రశ్నిస్తున్న పార్టీలకు అత్యంత కీలకమైనవి ఎన్నికల ప్రక్రియపై అనుమానం ఉన్న వారంతా మద్దతివ్వాల్సిన ఆరోపణలు అవి. కానీ ఏపీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని వాదిస్తున్న జగన్ మాత్రం ఇప్పుడు సైలెంటుగా ఉన్నారు.
100 లోక్ సభ స్థానాల్లో రిగ్గింగ్ జరిగిందని రాహుల్ ఆరోపణలు
దేశంలో వందకుపైగా లోక్ సభ నియోజకవర్గాల్లో రిగ్గింగ్ జరిగిందని దీనికి ఎన్నికల సంఘం కారణం అని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. ఓట్ల చోరీ జరిగిందని తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో ఏపీకి సంబంధించిన నియోజకవర్గాలు ఉన్నాయో లేవా అన్నది చెప్పలేదు.. త్వరలో ఆధారాలు విడుదల చేస్తామంటున్నారు. ఇలాంటి సమయంలో వైసీపీకి, జగన్ కు ఇంత కంటే మంచి అవకాశం రాదు. కేవలం ఈవీఎంల వల్లే ఓడిపోయామంటున్న వారు రాహుల్ తో కలిసి తమ వద్ద ఉన్న ఆధారాలు ఇచ్చి పోరాటం చేయాల్సింది.
రాహుల్ కు మద్దతుగా మాట్లాడకపోతే వేస్ట్
ఇప్పుడు రాహుల్ లేవనెత్తిన అంశంలో వైసీపీకి ఏకాభిప్రాయం ఉంది. ఇప్పటికీ ఈవీఎంలతో ఎన్నికలు వద్దని .. బ్యాలెట్లతోనే ఎన్నికలు నిర్వహించాలని వారు కోరుతున్నారు. ఇలాంటి సమయంలో రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించడం జగన్ కు నైతికతతో కూడిన అంశం. ఎందుకంటే ఆయన ప్రత్యర్థి పార్టీలు బీజేపీతో పొత్తులో ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇంకా బీజేపీని నమ్ముకుని కాంగ్రెస్ పార్టీతో కలసి నడవలేమని..తమ విధానాలపైనా రాజీపడటం చేతకానితనం. జగన్ రెడ్డి ఇప్పుడు అదే చూపిస్తున్నట్లుగా ఉన్నారు.
బీజేపీని వ్యతిరేకించలేకపోతే ఇక రాజకీయాలేం చేస్తారు ?
బీజేపీని వ్యతిరేకించలేక పోవడం ద్వారా.. అవసరం లేకపోయినా కాళ్ల దగ్గర పడి ఉండటం వల్ల జగన్ కు ఏం లాభం వస్తుందో తెలియదు కానీ.. కాంగ్రెస్ పార్టీ కనీసం సానుభూతి చూపించేందుకు కూడా ముందుకు రావడం లేదు. లిక్కర్ స్కాంలో జగన్ రెడ్డి అవినీతి శాస్త్రవేత్త అనే బిరుదు ఇచ్చి విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ తో కలిసి పోరాడటం ద్వారా జగన్ అంతో ఇంతో తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్లవుతుంది. కానీ అలాంటి ఆలోచనే పెట్టుకోలేని జగన్ …రాజకీయంగా విలువల్లేని వ్యక్తిగా మిగులుతున్నారు.