రాంచరణ్ కొత్త సినిమా – ‘మెరుపు’!

హైదరాబాద్: రాంచరణ్ – శ్రీనువైట్ల కాంబినేషన్‌లో దానయ్య నిర్మిస్తున్న చిత్రం తుదిదశలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మెరుపు అనే టైటిల్ ఖరారు చేసినట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం దసరాకు విడుదలచేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. టైటిల్‌‍ను చిరంజీవి పుట్టినరోజైన ఆగస్ట్ 22న ప్రకటిస్తారని తెలిసింది. ఇంతకుముందు ఈ చిత్రానికి బ్రూస్‌లీ, మై నేమ్ ఈజ్ రాజు, ఫైటర్, విజేత అనే టైటిల్స్ పెడదామని అనుకున్నప్పటికీ చివరికి మెరుపును ఖరారు చేశారు. వాస్తవానికి ఈ టైటిల్‌తో గతంలో రాంచరణ్-ధరణి కాంబినేషన్‌లో ఒక ప్రాజెక్ట్ ముహూర్తంకూడా జరుపుకున్నప్పటికీ, ఎందుకనో పట్టాలపైకెక్కలేదు. దానినే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు పెట్టారు. బ్యాంకాక్‌లో భారీస్థాయిలో క్లైమాక్స్ సన్నివేశాలు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతోంది.

వరస పరాజయాల తర్వాత చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను ఎలాగైనా హిట్ చేయాలని శ్రీనువైట్ల కృతనిశ్చయంతో ఉన్నారు. మరోవైపు గతంలో ఆయనతో గొడవపడ్డ ప్రకాష్ రాజ్, కోన వెంకట్ ఈ చిత్రంలో మళ్ళీ కలిసి పనిచేయటం విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close