తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులకు బండి సంజయ్ సంచలన ఆధారాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎనిమిదో తేదీన అంటే శుక్రవారం ఆయన సిట్ అధికారుల ఎదుట హాజరు కానున్నారు. ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండటంతో తన ఫోన్ ను ట్యాప్ చేసిన అంశంపై పూర్తి అధారాలను బయటకు తీసుకు వచ్చారు.
కేంద్ర హోంశాఖ అధికారుల్లో ట్యాపింగ్ అంశాలపై నైపుణ్యం ఉన్న వారిని హైదరాబాద్ కు పిలిపించారు. వారితో పాటు ఉమ్మడి ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు పోలీసు ఉన్నతాధికారుల్ని సైతం పిలిచి సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్ఐబీ, సిట్, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో పనిచేసిన అధికారులతో తన ఫోన్ ట్యాప్ చేసిన వైనంపై చర్చించారు. కేసీఆర్ ప్రభుత్వం బండి సంజయ్ ఫోన్ ను అత్యధికంగా ట్యాప్ చేసినట్లు నిర్దారించిన పోలీసులు కొన్ని ఆధారాలనూ సేకరించారు.
ఫోన్ ట్యాపింగ్ టెక్నికల్ ఎవిడెన్స్ ను.. బండి సంజయ్ కు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ ఎదుట హాజరవుతున్న తొలి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌నే. తనతో పాటు తన కుటుంబసభ్యుల ఫోన్లను ట్యాప్ చేశారని చాలా సార్లు ఆరోపించారు. ఇప్పుడు తన ఫోన్ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన అనేక ఆధారాలను సిట్ విచారణ సందర్భంగా సమర్పించనున్నారు. అలాగే సిట్ అధికారులు కూడా బండి సంజయ్ ఫోన్ ట్యాప్ అయిన వివరాలను ఆయనకు చెప్పనున్నారు.
ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బండి సంజయ్ కూడా సీరియస్ గా తీసుకున్నారు. అలా చేసే తనను పలుమార్లు అరెస్టు చేశారన్న ఆగ్రహం ఆయనలో ఉంది.