పులివెందులలో టీడీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా గెలవదని చాలా మంది వైసీపీ క్యాడర్ అనుకున్నారు. రిగ్గింగ్ చేస్తే గీస్తే తామే చేస్తామని అనుకున్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగిన తర్వాత కూడా వైసీపీ క్యాడర్ కు నమ్మకం ఉంది. అక్కడ జనానికి వైఎస్ కుటుంబంపై, జగన్ పై ఎంతో అభిమానం ఉంటుందని సైలెంటుగా జగన్ కే ఓట్లు వేస్తారని అనుకున్నారు. కానీ అసలు ఫలితం చూసిన తర్వాత వారు షాక్కు గురయ్యారు. ఇలా ఎలా జరిగిందని మథనపడుతున్నారు. ఎలా జరిగిందో ఆ పార్టీ పెద్దలకు తెలుసు. కానీ వారు చెప్పేది ఇంత కాలం నమ్ముతున్న క్యాడర్ కు మాత్రం అర్థం కావడం లేదు.
భయం అనే కోట కట్టిన వైఎస్ ఫ్యామిలీ
వైఎస్ ఫ్యామిలీ పులివెందులను కోటగా మార్చుకుంది. అయితే అది అభిమానంతో అని అందర్నీ నమ్మించారు. నిజానికి అది భయం అనే ఆయుధంతో కట్టుకున్న కోట. తమను కాదంటే బతుకు ఉండదని ..అసాంఘిక శక్తులను ప్రోత్సహించి వారికి మద్యం, గంజాయి వంటివి సమకూర్చి ముఠాలుగా మార్చుకున్నారు. వారితోనే ఫ్యాక్షన్ అని చెప్పి నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రాజారెడ్డి నుంచి ప్రారంభమైన సంస్కృతిని వైఎస్ రాజకీయాలకు పర్ ఫెక్ట్ గా వాడుకున్నారు. లొంగిపోయిన వారికి చిల్లర విదల్చడం.. తిరగబడేవారిని హతమార్చడం అనే పాలసీ పెట్టుకున్నారు. ఇక సామాన్య ప్రజలు ఆ భయం కోటలో బందీ అయిపోయారు.
భయం నుంచి బయటకు వస్తున్న జనం
ఇప్పుడిప్పుడే వైఎస్ కుటుంబ పెత్తనం నుంచి జనం బయటకు వచ్చే ఆలోచన చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోవడం.. ఆయన కుమారుడికి కనీస ఇంగితం లేదని తేలిపోవడంతో ఇక ఆయన వల్ల కాదని అందరికీ అర్థమైపోయింది. ఇప్పటికే వైఎస్ కుటుంబం ఎవరికి వారు అయింది. వివేకాను చంపుకుని ఆ కుటుంబం పూర్తిగా రోడ్డున పడింది. ఇంత కాలం పులివెందులలో భయం అనే ఫార్ములాను తన ఇంటి నుంచి నడిపించిన భాస్కర్ రెడ్డి ఇప్పుడు నిస్సహాయంగా ఉన్నాడు. ఇక వారి నుంచి ఎలాంటి ముప్పు ఉండదని వ్యవస్థలు కూడా భరోసా ఇస్తున్నాయి. దీంతో జనం మెల్లగా ఆ భయం అనే కోటను కూల్చేయడం ప్రారంభించారు.
కుప్పానికి.. పులివెందులకు అదే తేడా !
కుప్పంలో ఒక్క ఓటర్ అయినా భయంతో ఓటు వేసే పరిస్థితి ఉండదు. పూర్తిగా తమ ఇష్టానికే ఓటు వేస్తారు. చంద్రబాబు కుప్పాన్ని కంచుకోటగా మార్చుకున్నది అభిమానంతోనే.. మంచి చేయడం ద్వారానే. కానీ పులివెందులలో ఓట్లు అన్నీ భయం.. రిగ్గింగ్ ద్వారానే పడతాయి. రెండు నియోజకవర్గాలకు అదే తేడా. వైఎస్ ఇచ్చి పోయిన కోటను జగన్ రెడ్డి ఇప్పుడు కూల్చేసుకున్నారు. ఆయనకు నిలువనీడ లేదు. అది ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.