వైసీపీ నేత దాసరి కిరణ్‌ను విజయవాడ పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. ఆయన వ్యూహం సినిమా నిర్మాత కూడా కావడంతో.. ఎక్కువ ప్రచారం జరుగుతోంది. ఆయన వ్యూహం సినిమా నిర్మాత కావొచ్చు కానీ..వైసీపీ బ్రాండ్… చీటింగ్ కేసులు ఆయనపై చాలా ఉన్నాయని చెబుతున్నారు. ఆయన బంధువు దగ్గర నాలుగున్నర కోట్ల రూపాయలు అప్పు తీసుకుని..తిరిగి చెల్లించకుండా వారిపైనే దాడి చేయించిన కేసులో అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో అరెస్టు చేసి విజయవాడకు తరలించారు.
దాసరి కిరణ్ ఇప్పటి వరకూ తీసిన సినిమాల్లో ఒక్కటైనా హిట్ అనిపించుకున్నది లేదు. వ్యూహం సినిమా అయితే అసలు ధియేటర్లలో రిలీజ్ అయిందో లేదో కూడా తెలియదు. మొత్తం పెట్టుబడి అంతా తుడిచి పెట్టుకుపోయింది. అయితే ఆయన పేరు మాత్రమే వాడుకున్నారా.. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయా అన్నది మాత్రం తెలియదు.కానీ ఫైబర్ నెట్ లో ప్రసారం చేసినందుకు రామ్ గోపాల్ వర్మకు డబ్బులు చెల్లించారు. ఆయన నిర్మాత కానప్పుడు ఆయనకు ఎందుకు చెల్లించారో తేలాల్సి ఉంది.
వ్యూహం సినిమాను ప్రొడ్యూస్ చేసినందుకు జగన్ రెడ్డి ఆయనకు టీటీడీ మెంబర్ పోస్టు కొన్నాళ్లు ఇచ్చారు. హైదరాబాద్ కు చెందిన సాహితి రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్.. భారీగా ఫ్రాడ్ చేసి వేల కోట్లు పేదల దగ్గర ఇళ్ల పేరుతో కొట్టేసి జైలుకెళ్లారు. ఆయన అప్పటికి టీటీడీ బోర్డు మెంబర్ గా ఉండటంతో తొలగిచి.. ఆ స్థానంలో ఈ దాసరి కిరణ్ ను నియమించారు. ఇప్పుడు ఆయనను అరెస్టు చేసి చేసే విచారణలో వ్యూహం సినిమా కథలు ఏమైనా బయటకు వస్తాయేమో చూడాల్సి ఉంది.