భారతదేశ ఆఫీస్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో గ్లోబల్ , దేశీయ కంపెనీల నుంచి డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. ఆఫీస్ లీజింగ్ మార్కెట్ గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. దేశంలోని టాప్ 8 నగరాలు.. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ NCR, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, పూణే లలో గత ఏడాది గ్రాస్ లీజింగ్ వాల్యూమ్ సుమారు 89 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. 2025లో ఇది 90 msf దాటి కొత్త రికార్డు సృష్టించే అవకాశం ఉంది. H1 2025లో ఇప్పటికే 42 msf రికార్డు చేసిందని నివేదికలు చెబుతున్నాయి.
ప్రపంచగ్లోబల్ ఆర్థిక సవాళ్ల మధ్య కూడా గ్రాస్ లీజింగ్ డిమాండ్ పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి నిదర్శనంగా ఉంది. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCCs) విస్తృతంగా ఏర్పాటవుతున్నాయి. గ్లోబల్ కంపెనీలు టాలెంట్ పూల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారణమంగాపెద్ద ఎత్తున ఇండియాలో జీసీసీలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఫ్లెక్స్ వర్క్‌స్పేస్ ఆపరేటర్లు భారీగా పెరుగుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం SEZ భవనాలలో 50 శాతం వరకు నాన్-SEZ/డొమెస్టిక్ టారిఫ్ ఏరియాగా డీనోటిఫై చేయడం కంపెనీలకు ఆకర్షణీయంగా మారింది. హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రముఖ కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు భారీ ప్రణాళికలు వేసుకుంటున్నాయి. అతి పెద్ద క్యాంపస్ ఉన్న మైక్రోసాఫ్ట్.. మరో భవనాన్ని హైదరాబాద్ లో లీజుకు తీసుకుంది.
ఆర్థిక వృద్ధి, టాలెంట్ లభ్యత, SEZ సంస్కరణల వంటి పాలసీ సపోర్ట్ వంటి వాటి కారణంగా ఆఫీస్ రియల్ మార్కెట్ పెరుగుతోంది. దీని వల్ల ఉద్యోగావకాశాలు, ఆస్తుల విలువ పెరుగుదల వంటివి సహజంగానే ప్లస్ పాయింట్లుగా మారుతున్నాయి.