ఒక ఫాక్టరీ మోడల్లో సినిమా చేయాలని సినీ నిర్మాణంలోకి వచ్చారు విశ్వ ప్రసాద్. నిజానికి ఆయనకి సక్సెస్ ఫుల్ ఐటీ వ్యాపారాలు వున్నాయి. ఆ రంగంలో బోలెడు డబ్బు కూడాబెట్టుకోవచ్చు. అయితే సినిమాని కూడా ఆయన ఒక రంగంగా ఎంచుకున్నారు. బిగినింగ్‌లో కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఆ విమర్శల్ని ఆయననే స్వయంగా చెప్పారు.
”నేను సినిమాల్లోకి వచ్చినపుడు ఐటీలో ఉన్న వాళ్ళు సినిమాల్లోకి ఎందుకు వస్తున్నారో మాకు తెలుసనే నెగటివ్ కామెంట్లు విన్నాను. కానీ వాటిని పట్టించుకోలేదు. నిర్మాతగా గూడచారి సినిమా ఒక క్రెడిబిలిటీ ఇచ్చింది. ఆ తర్వాత ఏడాదికి కనీసం హిట్స్ ఉండేవి. కానీ గత ఏడాది అస్సల్ కలిసిరాలేదు. అలాంటి సమయంలో మిరాయ్ సక్సెస్ మాకు మళ్ళీ సినిమాలు చేసే ఎనర్జీ ఇచ్చింది” అన్నారు.
పీపుల్ మీడియా ఫాక్టర్లో వచ్చే సినిమాలపై కొన్ని నెగటివ్ కామెంట్స్ వినిపించేవి. విశ్వ ప్రసాద్ కి ఫ్రీ మనీ ఉందేమో, అందుకే ఇన్ని సినిమాలు దెబ్బలు తిన్నా ఇంకా సినిమాలు చేస్తున్నారనే మాటలు వినిపించాయి.
దీనికి అన్సర్ ఇస్తూ.. “నాకు ఫ్రీ మనీ లేదు. చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాను. డబ్బు విలువ తెలుసు. విలువ తెలిసే ఖర్చు చేస్తాను. కొన్ని కారణాల వల్ల కొన్ని సినిమాలకు క్వాలిటీ లోపాలు జరిగిన మాట నిజమే, కానీ ఏ సినిమా చేసినా నిజాయితీగానే ప్రయత్నించాం’అన్నారు
నిజానికి విశ్వప్రసాద్ ఎంత పెద్ద సినిమా తీసినా.. వేదికల్లో రెండు నిమిషాలకు మించి స్పీచ్ ఇవ్వరు. కానీ మిరాయ్ థాంక్ యూ మీట్లో దాదాపు 12 నిమిషాలు మాట్లడారు. తనపై వచ్చిన విమర్శలకు బదులు చెప్పారు.
సక్సెస్ వచ్చినప్పుడు మాట్లాడితే ఆ కిక్ వేరు. విశ్వప్రసాద్ కూడా అదే చేశారు. నెగటివ్ కామెంట్స్ కి సక్సెస్‌తోనే సమాధానం చెప్పారు. సక్సెస్ ఇచ్చే బలం ఇలానే ఉంటుంది.
