సెప్టెంబర్ 17 వస్తోందంటే తెలంగాణలో ఓ రేంజ్ రాజకీయం జరిగేది. ఆ రోజున నిజాం సంస్థానాన్ని దేశంలో విలీనం చేశారు. మొండికేసిన నిజాంను సైనిక చర్య ద్వారా వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో విలీనం చేశారు. ఆ రోజును రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. విలీనం అని ఒకరు.. విమోచన అని ఒకరు.. విద్రోహదినం అని మరొకరు తమ భావజాలాలకు తగ్గట్లుగా అనుకుని దానికి తగ్గట్లుగా రాజకీయాలు చేస్తూంటారు. అధికారికంగా నిర్వహించాలని బీజేపీ చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తోంది. చివరికి కేంద్రమే చేయడం ప్రారంభించింది. దాంతో వివాదం సమసిపోయింది. ఇప్పుడెవరూ పట్టించుకోవడం లేదు.
విలీన, విమోచన, విద్రోహదినం పేరుతో రాజకీయాలు
ఈ సెప్టెంబర్ 17న కూడా అలాంటి రాజకీయం చేయాలని కమ్యూనిస్టు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కానీ వారి మాటలకు విలువ లేకుండా పోయింది. బీజేపీ ఇలాంటి వివాదాలతో ఎక్కువ లాభపడుతూ వస్తోంది. ఇది ఖచ్చితంగా విమోచన దినోత్సవమేనని నిజాం ను తరిమేసి.. దేశంలో నిజా సంస్థానాన్ని భాగం చేశారు కాబట్టి విమోచనం అంటుంది. కాంగ్రెస్ పాలసీ ప్రకారం.. విలీనం జరిగింది. కమ్యూనిస్టుల భావజాలం ప్రకారం విద్రోహదినం అనుకోవాలి. కమ్యూనిస్టులు పలుచబడేకొద్దీ వారి వాయిస్ కూడా వినిపించడం తగ్గిపోయింది.
అధికారికంగా నిర్వహించడం ప్రారంభించిన కేంద్రం
గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా విమోచనాదినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసేది. తెలంగాణ వచ్చిన తర్వాత తాము అధికారికంగా నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించేవారు. దానికి కారణం ప్రత్యేక తెలంగాణకు మజ్లిస్ వ్యతిరేకం. అయితే ఉమ్మడి రాష్ట్రంగా ఉంచాలి లేకపోతే రాయల తెలంగాణ ఉండాలన్నది వారి డిమాండ్. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాజకీయంగా మజ్లిస్ అవసరం ఏర్పడింది . దాంతో ఆ పార్టీకి సమస్య లేకుండా అసలు మాట్లాడటం మానేశారు. అదే బీజేపీకి కలసి వచ్చింది. అప్పట్లో అలా రెచ్చగొట్టి ఇప్పుడెందుకు మాట్లాడరని ప్రతి సెప్టెంబర్ 17న ప్రభుత్వ కార్యాలయాలపై జెండా ఎగురవేసేవారు. దాని కోసం కొన్ని అరెస్టులు జరిగేవి. ఇప్పుడు అలాంటివేమీ లేదు.
ఇక సెప్టెంబర్ 17 పొలిటికల్ డ్రామాలు లేనట్లే !
విలీనమో.. విమోచనమో ఏదో ఒకటి జరిగిపోయింది.. కానీ దాని వెనుక ఇంత కాలం పెంచుకున్న సెంటిమెంట్ రాజకీయాలకు బ్రేక్ పడింది. ఈ రాజకీయాలు, భావోద్వేగాలపై ప్రజలు కూడా ఆసక్తి కోల్పోయారు. అందుకే ఎవరూ పట్టించుకోవడంలేదు. కానీ బీజేపీ, కమ్యూనిస్టులు లాంటి తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. కానీ మీడియా కూడా వాటిని లైట్ తీసుకుంటోంది.


