విశాఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కారణం డేటా రంగంలో లక్షలకోట్ల పెట్టుబడులు ఈ నగరానికి వస్తున్నాయి. టీసీఎస్ కూడా రూ. లక్ష కోట్లతో డేటా కేంద్రం పెట్టేందుకు సిద్ధమయింది. ఇక ఫేస్ బుక్ కంపెనీ మెటా కంపెనీ తన ‘వాటర్వర్త్’ అండర్ సీ కేబుల్ ప్రాజెక్ట్ కింద ముంబై, విశాఖపట్నాలను కేబుల్స్ ల్యాండింగ్ సైట్లుగా ఎంచుకుంది. US-ఇండియా మధ్య కనెక్టివిటీని పెంచాలని ప్రణాళిక వేస్తోంది. ఈ 10 బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ 50,000 కి.మీ. పొడవైన అండర్‌సీ కేబుల్‌ను దాదాపు 7,000 మీ. లోతులో వేస్తుంది, ఇది గ్లోబల్ డేటా ట్రాన్స్మిషన్కు 99 శాతం ఆధారం. అదే సమయంలో, గూగుల్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఆసియాలోనే అతిపెద్ద 1 GW డేటా సెంటర్ క్లస్టర్‌ను విశాఖలో నిర్మిస్తోంది.
విశాఖ పోర్ట్ సిటీగా, భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉండటం వల్ల IT & డిజిటల్ హబ్‌గా అభివృద్ధి చెందుతోంది. ఇది డేటా ట్రాన్స్‌ఫర్‌కు తక్కువ లేటెన్సీ అందిస్తుంది. అండర్‌సీ కేబుల్స్ ల్యాండింగ్ సైట్‌గా ఉండటం వల్ల గ్లోబల్ కనెక్టివిటీ పెరుగుతుంది. ఇది డేటా సెంటర్లకు హై-స్పీడ్ ఇంటర్నెట్ను హామీ ఇస్తుంది. గూగుల్ 2 బిలియన్ డాలర్ల రెన్యూవబుల్ ఎనర్జీ సౌర, విండ్ పెట్టుబడితో 1 GW కెపాసిటీని ఉత్పత్తి చేయనుంది. విశాఖ గ్రీన్ ఎనర్జీ పొటెన్షియల్‌తో ఇది సస్టైనబుల్ గా ఐటీ ఇండస్ట్రీ అంచనా వేస్తోంది.
కోస్టల్ సిటీ అయినప్పటికీ, విశాఖలో డిసాస్టర్ మేనేజ్మెంట్ ప్లానింగ్ బలంగా ఉంది. ఇది డేటా సెంటర్లకు సురక్షిత జోన్‌గా మార్చింది. కూలింగ్ సిస్టమ్స్‌కు అనుకూలమైన మితమైన వాతావరణం ఉంది. నీరు ఎక్కువ అవసరమే కానీ.. దానికి తగ్గట్లుగా ప్రణాళికల్ని ఆ సంస్థలు సిద్ధం చేసుకుంటున్నాయి. విశాఖ డేటా సెంటర్ హబ్‌గా మారడం దక్షిణ భారతదేశంలో AI & క్లౌడ్ రెవల్యూషన్‌కు మైలురాయి అనుకోవచ్చు. విశాఖకు ఉన్న ప్రత్యేకతల వల్లే ఇది సాధ్యమవుతోంది. వచ్చే పదేళ్లలో విశాఖ ప్రపంచంలోనే ప్రముఖ నగరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.