రవితేజకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఆయన ఏం పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ధమాకా తర్వాత ఆయనకు విజయమే కనిపించలేదు. బోనస్‌గా ఒకదానికంటే ఒకటి డిజాస్టర్స్ అవుతున్నాయి. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, ఇప్పుడు మాస్ జాతర .. ఇలా వరుసగా దెబ్బ కొట్టేశాయి. కానీ రవితేజ చేతిలో సినిమాలకు మాత్రం కొదవ లేదు. ఇప్పుడు వస్తున్న సంక్రాంతికి కూడా ఒక సినిమా సిద్ధంగా ఉంది.
కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి మూమెంట్ లేదు. గట్టిగా కొడితే రిలీజ్‌కి నెలన్నర మాత్రమే సమయం ఉంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్. కానీ ఇప్పటివరకు టైటిల్‌ను అధికారికంగా ప్రేక్షకులకు పరిచయం చేయలేదు.
మాస్ జాతర ఇచ్చిన షాక్ నుంచి ఆయన అభిమానులు ఇంకా తేరుకోలేదు. సంక్రాంతి రేస్‌లో వచ్చే సినిమాల సందడి ఇప్పటికే మొదలైంది. ఇందులో టైటిల్ ఖరారు కాని సినిమా రవితేజదే. సంక్రాంతి రిలీజ్ ఉద్దేశముంటే వెంటనే ప్రమోషన్లలో ముమ్మరం చేయాలి. లేనిపక్షంలో ఆ పోటీలో కనిపించడమే కష్టం.
