దేశంలో రాజకీయ నేతలందరూ పరామర్శలకు వెళ్తారు. ఏదైనా ఉత్పాతం జరిగితే.. విపత్తు సంభవిస్తే బాధితుల్ని అటు ప్రభుత్వం, ఇటు విపక్ష నేతలు పరామర్శిస్తారు. కానీ ఎవరూ చేయనంత హడావుడి… చేయాలని కూడా ఊహించనంత అతి ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేస్తారు. ఆయన చేసే అతి ప్రదర్శనల కారణంగా ప్రజలు తిప్పలు పడతారు. ప్రాణాలు రిస్క్ లో పడతాయి. ఆ బాధితులు మరింత బాధితులు అవుతారు. అయినా సరే ఆయన డోంట్ కేర్. జగన్ రెడ్డికి ఉన్న అనేక మానసిక సమస్యల్లో ఇది కూడా ఒకటి అనేది వైసీపీ నేతలు చెప్పే మాట.
తన కోసం జనం తొక్కేసుకుంటున్నారని అనుకునేలా జగన్ డ్రామాలు
జగన్మోహన్ రెడ్డికి తాను బయటకు వస్తే.. వస్తున్నానని తెలిస్తే తనకు చూసేందుకు జనం వెల్లువలా వస్తారని చూపించుకోవాలని ఆశ ఉంటుంది. జనం రాకపోతే తనను పట్టించుకోవడంలేదని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారని..తానో అనామక లీడర్‌గా మిగిలిపోతానని ఆయన భయం. అందుకే బయటకు రావాలంటే పక్కా స్క్రిప్ట్ ప్రకారమే వస్తారు. వారం రోజుల తర్వాత తుపాను బాధితుల్ని పరామర్శించడానికి.. ఏడాది తర్వాత బెట్టింగ్ ఆత్మహత్య బాధితుడి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి. .. అందరూ మర్చిపోయాక తెనాలి రౌడీ షీటర్లను పరామర్శించడానికి వెళ్లడానికి అదే కారణం. కాస్త టైం తీసుకుని జన సమీకరణకు అందరికీ టార్గెట్లు పెట్టి అప్పుడు బయలుదేరుతారు.
-దేశంలో మరే నేతకూ ఉండని మానసిక దౌర్బల్యం
చివరికి జగన్ రెడ్డి పెళ్లిళ్లకు వెళ్లినప్పుడు కూడా జన సమీకరణ చేస్తారంటే ఆయన మానసిక స్థాయి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాను పరిపాలనలో లేకపోవడం వల్ల ప్రజలు బాధపడిపోతున్నారని ఆయన అనుకుంటారు . అలా అనుకునేలా బయటకు వచ్చినప్పుడు స్క్రిప్టెడ్ స్కిట్స్ నుప్రవేశ పెడతారు. అన్నీ అబద్దాలు చెబుతారు. తాను చేసేది అంతా డ్రామా అని జగన్ కు తెలుసు. కానీ అదే రాజకీయం అని ఆయన నమ్ముతారు. తన కోసం మోకాళ్ల దండాల ఆర్టిస్టుల సహా అన్ని వర్గాలూ బయలుదేరి వస్తారు.
పరామర్శల పేరుతో ప్రజలకు.. బాధితులకూ నరకం చూపించే జగన్ !
బాధితుల్ని పరామర్శించేందుకు ఆయన చేసిన స్కిట్లు కారణంగా సామాన్య ప్రజలతో పాటు ఆయన పరామర్శించాలనుకున్న వారికి మరిన్ని కష్టాలు ఎదురవుతాయి. వేసుకొచ్చిన మూక మొత్తం పంటను తొక్కేస్తుంది. బాగున్న పంటను కూడా తొక్కేయడంతో జగన్ పరామర్శ రైతులకూ ఇబ్బందికరంగా మారింది. జగన్ రెడ్డి మానసిక స్థితి కారణంగా దేశంలో ఏ నేత కూడా చేయని విధంగా రాజకీయాలు చేస్తూంటారు. తాను వస్తే జనం వచ్చేస్తారని అనిపించుకోవడం కోసం తంటాలు పడుతున్నారు. కానీ ఆయన వస్తే .. జన సమీకరణ చేయకుండా కూడా రారనేది అసలు నిజం.
