కడపజిల్లాకు చెందిన మహిళా క్రికెటర్ శ్రీచరణికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భారీ ప్రోత్సాహకాలుప్రకటించారు. రెండున్నర కోట్ల రూపాయనగదు ప్రోత్సాహకంతో పాటు గ్రూప్ వన్ ఉద్యోగం ఇవ్వనున్నారు. అలాగే కడపలో ఇంటి స్థలం కూడా ఇస్తామని ప్రకటించారు. టోర్నీలో విజయం తర్వాత ఢిల్లీ నుంచి మొదటి సారి ఏపీకి వచ్చిన శ్రీచరణికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు, లోకేష్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీచరణి ఆటతీరును ఆభినందించారు. ఇంతటితో ఆగవద్దని మరింతగా పేరుతెచ్చుకునేలా ప్రతిభ చూపాలని ఆకాంక్షించారు.
కడప జిల్లాకు చెందిన శ్రీచరణి మహిళా క్రికెట్లో స్పిన్నర్ గా జాతీయ జట్టులో భారత టీం విజయంలో కీలక పాత్ర పోషించారు. తుది జుట్టులో ప్రధానమైన స్పిన్నర్ గా రాణిస్తూ.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ కూడా.. శ్రీచరణితో పాటు వచ్చారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన శ్రీచరణి ఇప్పుడు స్టార్ క్రికెటర్ అయ్యారు. మేల్ క్రికెటర్స్ తో పాటు.. ఇప్పుడు మహిళా క్రికెటర్స్ కూ క్రేజ్ వచ్చింది.
శ్రీచరణి తన ప్రతిభను మెరుగుపరుచుకునేందుకు అవసరమైన సాయం చేసేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఏసీ ప్రోత్సాహం తనను ఈ స్థాయికి తీసుకు వచ్చిందని శ్రీచరణి సంతృప్తి వ్యక్తం చేశారు.అసలు శ్రీచరణి ఏపీకి రాక ముందే.. ఆమెను పట్టించుకోవడం లేదని.. వైసీపీ నేతలు రివర్స్ లో ప్రచారం చేశారు. భారీ ప్రోత్సాహకాలు ఇస్తారని తెలిసి.. తమ వల్లే ఇచ్చారని క్రెడిట్ చోరీ చేయడానికి ప్లాన్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ తరపున శ్రీచరణికి ఎలాంటి ప్రోత్సాహం ప్రకటించలేదు.