వైసీపీ స్ట్రాటజిస్ట్, కుట్ర సిద్ధాంత నిపుణులు సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ కోసం పని చేసే కాస్త విశ్వసనీయత ఉన్న పావుల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మేధావుల ముసుగులో, తటస్థుల ముసుగులో, వివిధ రంగాల నిపుణుల ముసుగులో ఏపీ ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు దాడి చేస్తూ టీడీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తూ.. వైసీపీకి మేలు చేసేలా బలంగా వాదించే వారికి ప్రాధాన్యత ఇస్తారు. 2014-19 సమయంలో ఇలాంటి వారిని పట్టుకుని ప్రభుత్వంపై విపరీతంగా ఆరోపణలు చేయించడంలో సజ్జల సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆయనకు సమస్యలు వస్తున్నాయి. ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.
కలుగుల్లోకి వెళ్లిపోయిన పాత మేధావులు
గతంలో తెలకపల్లి నుంచి కళ్లం అజయ్ రెడ్డి వరకూ అనేక మంది తెలంగాణకు చెందినా.. ఏపీకి చెందినా… హైదరాబాద్ నుంచిఏపీలోకి తరచూ వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి మార్గదర్శకత్వంలో చేయాల్సిన పనులు, మాట్లాడాల్సిన మాటలు మాట్లాడి వెళ్లేవారు. చాలా మంది మీడియాలో కూర్చుని వివరించేవారు. వార్తా కథనాలు రాసేవారు. ఇలాంటి వారిలో హైకోర్టులో పని చేసిన మాజీ న్యాయమూర్తులు కూడా ఉండేవారు. ఐవైఆర్ సహా ఎంతో మంది టీడీపీ ప్రభుత్వంలో వారందరూ అప్పటి టీడీపీ ప్రభుత్వం చేసిన దాడి చిన్నది కాదు. ఎంతో బాగా పని చేసినా 2019లో టీడీపీ ఘోర ఓటమికి వీరు ప్రధాన కారణం.
కొత్త మేధావుల కోసం సజ్జల విస్తృత ప్రయత్నాలు
అలాంటి ఎఫెక్ట్ తీసుకు రావడానికి సజ్జల కొత్త మేధావుల్ని పే రోల్స్ లోకి తీసుకు వచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కొంత మంది విషయంలో సక్సెస్ అయ్యారు. అలాంటి వారిలో జడ శ్రవణ్ ఒకరు. ఆయన 2014-19 మధ్యలో నారా లోకేష్ చాలా ఐటీ పరిశ్రమలకు అప్పనంగా భూములిచ్చారని కోర్టుల్లో కేసులు వేశారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. పెద్దగా పట్టించుకోలేదని మళ్లీ వైసీపీ ప్రభుత్వంపై కేసులు వేశారు. అందుకే ప్రతిఫలంగా ఆయన చాలా ఆశించారు. కుదరకపోవడంతో కొత్త పార్టీ పెట్టుకున్నారు. ఇప్పుడు వైసీపీ ఫోల్డ్ లోకి వెళ్లిపోయారు. పవన్ కల్యాణ్ తో పాటు టీడీపీని టార్గెట్ చేసే బాధ్యత సజ్జల అప్పగించారని ఇటీవల జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. తన పార్టీకి చెందిన ఓ చోటా నేతను తీసుకు వచ్చి.. ఆయన చేయించిన ఆరోపణలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మరీ రాజకీయాలు ఇంత ఈజీనా అనుకుంటున్నారు. ఇలాంటి వారు ఇంకా ఇంకా ముందు ముందు వచ్చేవారున్నారు.
సంశయిస్తున్న కొంత మంది వైసీపీ సానుభూతిపరులు
నిజానికి జగన్ రెడ్డి కోసం పని చేయడానికి కొంత మంది సజ్జల కోరుకున్న తటస్థ ముసుగు ఉన్న మేధావులు, వివిధ రంగాల నిపుణుల పేరుతో కొంత మంది రెడీగా ఉన్నారు. కానీ ఇప్పటికే వైసీపీ అధినేత పావులుగా వాడుకున్న వారి పరిస్థితి అత్యంత ఘోరంగా ఉండటంతో వారు వెనుకాడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం 2014-19 మధ్య వ్యవహరించినట్లుగా వ్యవహరించే అవకాశం లేదని.. తేడా వస్తే కేసులు పెట్టి లోపలేస్తుందని.. ఇప్పటి వరకూ సంపాదించుకున్న పరువు అంతా పోతుందని భయపడుతున్నారు. అందులే సజ్జల ప్రయత్నాలు సక్సెస్ కావడం లేదు. కానీ సజ్జల మాత్రం బడ్జెట్ పెంచి అయినా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన ప్రయత్నాలు ఫలించి… కొంత మంది త్వరలోనే ప్రభుత్వంపై అడ్డగోలు దాడులు చేసేందుకు ముందుకు వస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి.


