ఏపీలో కరెంట్ బిల్లులు తగ్గాయి. యూనిట్ కు రూ. 13 పైసలు చొప్పున లెక్క కట్టి వినియోగదారులకు వెనక్కి ఇస్తున్నారు. మొత్తం బిల్లులో అంత మేర ట్రూడౌన్ చేస్తూ బిల్లులు జారీచేస్తున్నారు. కరెంట్ చార్జీలు పెంచేది లేదని కుదిరితే తగ్గిస్తామని సీఎం చంద్రబాబు తరచూ చెబుతూంటారు. అయితే ఇది తగ్గింపు కాదు. అదనంగా వసూలు చేసిన వాటిని వెనక్కి తిరిగి ఇస్తున్నారు. ఈ మొత్తం రూ.900 కోట్లకుపైగా ఉంది.
ఇలా తిరిగి ఇచ్చేలా చేసింది కూడా జగన్మోహన్ రెడ్డే. ఆయన హయాంలో ట్రూ అప్ చార్జీల పేరుతో ఇష్టం వచ్చినట్లుగా ప్రజల్ని బాదేశారు. ఇలా పెద్దఎత్తున వసూలు చేసిన తర్వాత ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యూలేటరీ కమిషన్.. చాలా ఎక్కువ వసూలు చేశారని అందులో 900 కోట్లు తిరిగి చెల్లించాల్సిందేనని ఆదేశించింది. జగన్ ప్రభుత్వమే ఉండి ఉంటే..తిరిగి ఇవ్వడం ఎందుకని.. ఎక్కడో ఓ చోట లెక్క చెప్పేవారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వారి డబ్బులు వారికి తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఈ నెలనుంచి బిల్లుల్లో సర్దుబాటు చేస్తున్నారు.
ఏపీలో ట్రూఅప్ చార్జీలు, ఇతర చార్జీలుఎక్కువగా ఉంటున్నాయి. వచ్చే ఏడాది కాలంలో వీటన్నింటినీ తీసేయాలని .. కేవలం వాడుకున్న కరెంట్ చార్జీలకు మాత్రమే వినియోగదారులు బిల్లులు కట్టేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లుగా బయట నుంచి అత్యధిక రేట్లకు బిల్లులు కొని.. వాటిని ప్రజల నెత్తిపై వేసేది.


