అఖండ2 టీజర్ ట్రైలర్ బయటికి వచ్చాయి. అఖండతో పోల్చుకుంటే యాక్షన్ హైవోల్టేజ్ లో కనిపించాయి. బాలయ్య పాత్ర అంతకుమించి అన్నట్టుగా కనిపించింది. కాకపోతే త్రిశూలం, గన్ ప్రాపర్టీస్ వాడి చేసిన యాక్షన్ సీక్వెన్స్ లు లాజిక్ దూరంగా వున్నాయనే కామెంట్లు వినిపించాయి.
అయితే ఈ సీన్స్ వెనుక లాజిక్ వుందని క్లారిటీ ఇచ్చారు పైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్. ఇందులో బాలయ్య శివ అనుగ్రహం వున్న పాత్రలో కనిపిస్తారు. సహజంగా గన్ కి పవర్ వుంటుంది. ఆ పవర్ కి త్రిశూలం తోడైతే.. దానికి శివశక్తి జతకడితే.. ఎంత దైవిక శక్తి ఉత్పన్నమౌతుందో దానికి తగ్గట్టుగా యాక్షన్ డిజైన్ చేశారట.
అన్నట్టు బాలయ్య పాత్ర ఇందులో మూడు వేరియేషన్స్ లో కనిపిస్తుందట. ప్రతి పాత్రకి కొన్ని పరిమితులు, శక్తులు వుంటాయి. దానికి తగ్గట్టుగానే యాక్షన్ డిజైన్ చేశారట. అఖండలో రధ చక్రం సీన్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాంటి సిగ్నేచర్ సీన్ అఖండ2 లో కూడా వుందట. డిసెంబర్ 5 ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తోంది.
