విద్యార్థులకు మార్కులు మాత్రమే లక్ష్యంగా ఉండేవి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త ఒరవడి మొదలైంది మార్కులతో పాటు మానవత్వం అని బోధిస్తున్నారు. . ఈ మార్పుకు మూలస్తంభంగా నిలుస్తున్నారు ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు. ఆయన మార్గదర్శకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్న ‘నైతిక విలువల విద్యా సదస్సు’ కార్యక్రమం ఏపీ విద్యార్థుల్లో లోతైన, శాశ్వతమైన మార్పును తీసుకొస్తోందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు నమ్మకంగా ఉన్నారు.
విలువలు మాటల్లో కాదు చేతల్లో ఉండాలి
ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థను నైతిక విలువలతో బలోపేతం చేసి సమాజ మార్పును సాధించాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఉంది. ఆ బాధ్యతలను ప్రవచన సార్వభౌముడైన చాగంటి కోటేశ్వర రావు కు అప్పగించారు. ఆయన విలువలను విద్యలో భాగం చేసేందుకు పుస్తకాలు సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో నైతిక విలువల విద్యా సదస్సులను నిర్వహిస్తున్నారు. విజయవాడలో సోమవారం జరిగిన సదస్సు విద్యార్తి లోకాన్ని ఆర్షించింది. విద్యార్థులకు ‘విలువలు’ అనేది కేవలం మాటల్లోనే కాకుండా ఆచరణలో ఉండాలనేది చాగంటి వారి భావన. యువతను దేశభక్తులుగా, నైతికవంతులుగా తీర్చిదిద్దడానికి స్కూల్ స్థాయిలోనే నైతిక విలువలను పాటించేయాలా చేయాలన్నది ఆయన సంకల్పం.
తల్లికి చెప్పలేని పనులు చేయకూడదు !
ఫలానా పని చేస్తున్నాం అని లేదా.. చేయశామని తల్లికి చెప్పలేని పనులు చేయకూడదని విద్యార్థులకు చాగంటి ప్రవచించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండాలి. విద్య ద్వారా మాత్రమే కాకుండా, నైతికతతో సమాజాన్ని మార్చాల్లి ఉందన్నారు. తల్లిదండ్రుల్ని గౌరించలేని వారి దగ్గర నుంచి ఎలాంటి విలువల్నీ ఆశించలేరు.
చాగంటి వారి విలువల బోధనతో క్రమంగా వస్తున్న మార్పు
గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సొంతంగా ప్రతిరోజూ 10 నిమిషాలు స్కూల్ శుభ్రం అనే ఉద్యమం ప్రారంభించారు. తిరుపతి జిల్లా ఒకటి రెండు పాఠశాలల్లో ప్లాస్టిక్ బాటిల్స్ పూర్తిగా నిషేధం అయ్యాయి. విద్యార్థులే స్వచ్ఛందంగా స్టీల్ బాటిల్స్ తెచ్చుకుంటున్నారు. విజయనగరం జిల్లా ఒక జూనియర్ కాలేజీలో 2025 సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు 680 మంది విద్యార్థులు రక్తదానం చేశారు . కర్నూలు జిల్లాలో విద్యార్థులు ప్రతి ఆదివారం స్థానిక వృద్ధాశ్రమానికి వెళ్లి, వృద్ధులతో గడిపి, ఆహారం పంచుతున్నారు.
విద్య నేర్చుకునేదే.. మార్కులతో వచ్చేది కాదు!
పరీక్షల్లో కాపీ కొట్టి అయినా పాసవ్వాలని అనుకుంటారు. కానీ చదువు లక్ష్యం అది కాదు. నేర్చుకోవడం ద్వారా వచ్చే విజ్ఞానమే అసలైన చదువు. అసత్యంతో వచ్చిన మార్కులు జీవితంలో శాశ్వత శాపంగా మిగులుతాయని చాగంటి వారు తన విలువల్లో బోధిస్తున్నారు. ఇది విద్యార్థుల మనసు మారుస్తోంది. చాగంటి మార్గదర్శకత్వంలో విడుదల కానున్న ‘నైతిక విలువల పాఠ్యపుస్తకాలు’ 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అమలు కానున్నాయి. ప్రతి శుక్రవారం ఒక గంట ‘విలువల గంట’ రాష్ట్రవ్యాప్తంగా తప్పనిసరి అవుతోంది.
ఈ ప్రతిఫలం.. మనకు భవిష్యత్ తరంలో కనిపిస్తుంది. నీతి, నిజాయితీ ఉన్న యువతరం.. సమాజాన్ని మార్చేస్తుంది. అలాంటి ప్రపంచం కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు.
