మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన చారిటబుల్ ట్రస్ట్‌కు కేంద్ర హోంశాఖ అధికారులు ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనుమతి లభించింది. ఈ అనుమతితో ట్రస్ట్ విదేశీ విరాళాలు స్వీకరించవచ్చు. 25 సంవత్సరాల చరిత్ర కలిగిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ , ఐ బ్యాంక్‌ల సేవలను అందించేందుకు విదేశాల నుంచి విరాళాలు స్వీకరించడానికి ఇంత కాలం FCRA అనుమతి రాలేదు.
హోంశాఖ గురువారం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు FCRA రిజిస్ట్రేషన్ అప్రూవల్ ఇచ్చింది. ఈ అనుమతి వల్ల ట్రస్ట్ విదేశీ దాతల నుంచి నేరుగా విరాళాలు అందుకుని, ఆరోగ్య సేవలు, రక్త దాన క్యాంపులు, కంటి దాన ప్రచారం వంటి కార్యక్రమాలను మరింత బలోపేతం చేసుకోగలదు. FCRA రిజిస్ట్రేషన్ పొందిన సంస్థలు మాత్రమే విదేశీ నిధులు స్వీకరించాలి.
విదేశాల నుంచి స్వచ్చంద సంస్థలు విరాళాలుగా సేకరించి దేశంలో మత మార్పిళ్లకు పాల్పడటం, దేశంలో అరాచకశక్తులు, వేర్పాటువాదులు, తిరుగుబాటుదారులకు మద్దతుగా ఉండటం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో FCRA రూల్స్ ను కఠినం చేసిన కేంద్రం.. అనుమతులు ఇవ్వడం దాదాపుగా ఆపేసింది. అనంతపురంలో ఆర్డీటీ వంటి సంస్థలకూ అనుమతులు రాలేదు. విదేశాల నుంచి వచ్చే విరాళాలతో దేశ వ్యతిరేక చర్యలు, మత మార్పిళ్లకు పాల్పడరు అని నమ్మిన వారికే ఇస్తున్నారు.