అఖండ తరవాత అఖండ తాండవం చూడబోతున్నారు నందమూరి అభిమానులు. ఈ ఫ్రాంచైజీని కొనసాగించాలని బాలయ్య,బోయపాటి కూడా భావిస్తున్నారు. అఖండ 2 క్లైమాక్స్ లో పార్ట్ 3 ఉందని రివీల్ కూడా చేయబోతున్నారు. మరి అఖండ 3 టైటిల్ ఏమిటన్నదే అసలు ప్రశ్న. ‘అఖండ 2’ని ‘అఖండ తాండవం’ అని పిలుచుకొంటున్నారు. అఖండ 3కి ఎలాంటి పేరు పెడతారో చూడాలి.
అన్నట్టు అఖండ టీమ్ నుంచి ఓ పిక్ బయటకు వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని ముగించుకొన్న టీమ్.. తాజాగా ఓ ఫొటో బయటకు వదిలింది. తమన్ రికార్డింగ్ స్టూడియోలో, బోయపాటి శ్రీను ఉన్న ఫొటో అది. వెనుక స్క్రీన్ మీద ‘జై అఖండ’ అనే అక్షరాలు కనిపిస్తున్నాయి. దాంతో నందమూరి ఫ్యాన్స్ అంతా అఖండ 3 టైటిల్ ఇదేనేమో అనేసుకొంటున్నారు. నిజానికి సీక్వెల్స్, ప్రీక్వెల్స్ టైటిల్స్ ని ఇలా క్లైమాక్స్ కార్డ్ రూపంలో చూపించడం సహజంగా జరిగేవే. అఖండ 2 క్లైమాక్స్ లో ఈ కార్డ్ ప్లే చేస్తే టైటిల్ కూడా దాన్నే ఫిక్స్ చేసినట్టు అనుకోవాలి. నిజంగానే జై అఖండ టైటిల్ బాగానే వుంది. సింహా హిట్టయ్యాక.. బాలయ్య నుంచి జైసింహా అనే మరో సినిమా వచ్చింది. అది కూడా బాగానే ఆడింది. ఆ సెంటిమెంట్ తోనే ‘జై అఖండ’ టైటిల్ ఫిక్స్ చేసి ఉండొచ్చు. పైగా అఖండ టైటిల్ సాంగ్ లో జై అఖండ అనే పదం కూడా చాలాసార్లు వినిపిస్తుంది. అలా చూసినా ఇది పర్ఫెక్ట్ టైటిల్ అనుకోవాలి.
ఈనెల 5న అఖండ 2 రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. 4వ తేదీ రాత్రి నుంచే ప్రీమియర్ల హంగామా మొదలు కానుంది. ఈసారి బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ చూసే వీలుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
