చిన్న బడ్జెట్ లో అన్ని కథలు సక్సెస్ కావు – ‘ పెళ్లి చూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్

సినిమాలపై ఉన్న ఇష్టంతో ‘సైన్మా’ అనే షార్ట్ ఫిలిమ్స్ తో తన జర్నీని మొదలుపెట్టి సినిమా ఇండస్ట్రీలోని కొందరు పెద్దల దృష్టిని ఆకర్షించిన వ్యక్తి ‘తరుణ్ భాస్కర్’. గ్లోబల్ సినిమా తరహాలో మన చుట్టూ నిత్యం జరిగే కథలనే సినిమాగా తెరకెక్కించాలని ‘పెళ్లి చూపులు’ అనే ఓ ఫ్రెష్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించాడు. ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేసినప్పటి నుండి ప్రివ్యూ షోల వరకూ అనూహ్య స్పందన సొంతం చేసుకున్న ఈ చిత్రం చిత్రం జూలై 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదలకు ముందే దాదాపు అన్ని వెబ్ సైట్స్ లలో త్రి స్టార్స్ పైగా రేటింగ్ తెచ్చుకున్న ఈ చిత్రం సూపర్ హిట్ అయినా సందర్బంగా దర్శకుడు తరుణ్ భాస్కర్‌తో తెలుగు360.కామ్ జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

*అసలు మీ ఈ సినిమా జర్నీ ఎలా మొదలైంది ?

ముందుగా ‘బీటెక్’ అనే డ్రామా స్క్రిప్ట్ ను షార్ట్ ఫిల్మ్ గా తీయడంతో నా ఫిల్మ్ మేకింగ్ కెరీర్ మొదలైంది. ‘అష్టాచమ్మా’ నిర్మాత రామ్మోహన్ గారి సహకారం తో ఆ షార్ట్ ఫిలిం తీసాను. ఆ తరువాత ‘సైన్మా’ అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా కాస్త పేరొచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ తో ఈ ‘పెళ్లి చూపులు’ అనే ఫ్యామిలీ డ్రామా స్క్రిప్ట్

*ఈ స్క్రిప్ట్ ను రాయడానికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలు ?

నేను మొదటి నుండి రియాలిటీ బేస్డ్ స్టోరీనే రాద్దామనుకున్నాను. నేను పెరిగిన వాతావరణం, తిరిగిన ఫ్రెండ్స్, మాట్లాడిన వ్యక్తులు ఇలా అన్నీ కలిసి ఓ రియలిస్టిక్ స్టోరీని రాసేలా ప్రేరేపించాయి.

*ఇలాంటి రియాలిటీ బేస్డ్ స్టోరీ రాస్తున్నప్పుడు ఎలా ఫీలయ్యారు ?

స్టోరీ రాస్తున్నప్పుడు నా జర్నీ చాలా కష్టమవుతుందని అనుకున్నాను. ఎందుకంటే ఇంకా మన దగ్గర హీరోయిజం, డైలాగ్ ఓరియంటెడ్ సినిమా ఉంది కాబట్టి జనాలు చూస్తారా చూడరా, ఎవరైనా ప్రొడ్యూస్ చేస్తారా చెయ్యరా అని భయపడ్డాను. కానీ ప్రయత్నం చేసి చూద్దామని చేశాను.

*ఫస్ట్ టైం ఈ కథని ఎవరికి చెప్పారు ?

మొదట నా సైన్మా షార్ట్ ఫిల్మ్ చూసి మంచు లక్ష్మి గారు నన్ను పిలిచి సినిమాకి అడ్వాన్స్ ఇచ్చారు. అప్పుడామెకు ఈ స్టోరీ చెప్పగానే ఆమెకు కూడా కథ బాగా నచ్చి చేద్దామనుకున్నాం, కానీ ఆమెకున్న బిజీ వల్ల కుదరలేదు. ఆ తరువాత రాజ్ కందుకూరి గారిని కలిసి ఆయనకు కథ చెప్పగానే నచ్చి సినిమా మొదలుపెట్టాం.

*సినిమాకి ఇంత పెద్ద హిట్ టాక్ వస్తుందని ఊహించారా?

– లేదండి..ఫస్ట్ కాపీ చూసిన తరువాత సురేష్ బాబు గారు నాకు కంగ్రాట్స్ చెప్పారు. సహజం గా అందరు నిర్మాతలు దర్శకుడికి అభినందనలు చెప్పడం మాములే కదా అనుకున్నాను. కానీ ఆ రోజు ప్రెస్ కి ప్రివ్యూ ఏర్పాటు చేద్దాం అన్నపుడు ఎన్నో హిట్ సినిమాలు తీసిన, చూసిన అయన మనో ధైర్యాన్ని చూసి సినిమా ఏ రేంజ్ లో వుందో అర్ధం చేసుకున్నాను.

*అసలు సినిమా విడుదల కు ముందుగా ప్రివ్యూ వేశారు కదా మీకు ఎలా అనిపించింది?

– ఇది సురేష్ బాబుగారి ఐడియా. 700ల మందికి చూపిస్తే అందులో 99% మందికి ఖచ్చితంగా నచ్చుతుందని, సినిమాలో పెద్ద స్టార్లు లేరు కాబట్టి మంచి మౌత్ టాక్ హెల్పవుతుందని, మన దగ్గర మంచి ప్రోడక్ట్ ఉంది కాబట్టి ధైర్యంగా చూపించమన్నారు. ఆయన అన్నట్టే ఈరోజు అదే జరిగింది. ఆయనకు ధ్యాంక్స్ చెప్పాలి. మొదట సురేష్ బాబుగారంటే, పెద్ద నిర్మాతలంటే మంచి సినిమాలు తీయరని, ఏవేవో విన్నాను కానీ ఆయనను నన్ను ఓపెన్ హార్ట్ తో రిసీవ్ చేసుకున్నారు. ఈ సినిమా విషయంలో ఆయనిచ్చిన సపోర్ట్ మర్చిపోలేను.

*మొదట స్టోరీని సురేష్ బాబుగారికి చెప్పారా ?

– అవును. మొదట సురేష్ బాబుగారికి కథ చెప్పగానే ఆయనకు సెకండ్ హాఫ్ నచ్చలేదు. మార్చమన్నారు. నేను అలాగే దాని మీద వర్కవుట్ చేసి తీసుకెళ్ళాను. తరువాత సురేష్ బాబుగారే రాజ్ కందుకూరికి నన్ను పరిచయం చేశారు. తరువాత రాజ్ గారు కథ వినడం, ఒకే చెప్పడం అన్నీ జరిగిపోయాయ్.

*తక్కువ బడ్జెట్ లో ఈ చిత్ర నిర్మాణం ఎలా సాధ్యం అయ్యింది?

నేను రాసుకున్న స్క్రిప్ట్ లో ఎలా వుందో అలానే ముందుగా అనుకున్న లొకేషన్స్, బ్లాక్స్, లలో షూటింగ్ జరిపాము. రియాలిటీ బేస్డ్ స్టోరీ కదా? మాకు ఎంత వరకు బడ్జెట్ అవసరమో అంతే ఖర్చు పెట్టాము. సినిమా ఇంత బాగా రావడానికి నా టీం సప్పోర్ట్, నిర్మాతల సహకారం తో అది సాధ్యం అయ్యింది. అలా అని అన్ని కథ లు చిన్న బడ్జెట్ లో సక్సెస్ కావు.

*ఈ సినిమాకి పని చేసేటప్పుడు మీ అనుభవాలు చెప్తారా ?

– మా టీమ్ మొత్తం ఈ సినిమా కోసం క్లౌడ్ ప్రొడక్షన్ ను యూజ్ చేశాం. అంటే ‘ప్రొడక్షన్ మైన్స్’ అనే సాఫ్ట్ వేర్ ద్వారా మొత్తం స్క్రిప్ట్, లొకేషన్స్, డైలాగ్స్ ఇలా అన్నీ దాని ద్వారానే టీమ్ తో పంచుకునే వాళ్ళం. పైగా షార్ట్ ఫిలిమ్స్ చేసిన అనుభవం ఉండటం వల్ల పెద్దగా ఇబ్బందులేవీ రాలేదు. మొత్తం 32రోజుల్లో సినిమాని షూట్ చేసేశాం.

* ‘ప్రొడక్షన్ మైన్స్’ సాఫ్ట్ వేర్ అన్నారు దాని గురించి చెప్తారా ?

– చిన్న బడ్జెట్ లో మంచి సినిమా చెబుతున్నామంటే అప్పుడుడప్పుడు లాజిస్టికల్ గా ఫెయిల్ అవచ్చు. లొకేషన్స్, బడ్జెట్, డేట్స్, టైమింగ్స్ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయ్. అలాగే ఒక అనుభవం లేని క్రూతో పనిచేస్తున్నప్పుడు సినిమా అనుకున్నట్టు రాదు. కానీ ఇలాంటి సాఫ్ట్ వేర్ల వల్ల క్రియేటివ్ విజన్, పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ఇందులో షాట్స్, డైలాగ్స్, క్యారెక్టర్స్, రన్ టైం అన్నీ ఇందులో క్లియర్ గా తెలిసిపోతాయ్. దీన్నీ వల్ల షూటింగ్ మొదటిరోజు ఏం అనుకున్నానో అదే తీశాను.

*హీరో విజయ్ మీకెలా తెలుసు?

– షార్ట్ ఫిల్మ్ తీసేటప్పటి నుండి విజయ్ నాకు తెలుసు. అతను చాలా బాగుంటాడు. అంత అందంగా ఉండేవాళ్ళకు నటన రాదని అన్నారు. కానీ ఎవడె సుబ్రహ్మణ్యం చూశాక షాక్. అందులో రిషీ పాత్ర లో చాలా బాగా నటించాడు. ఈ సినిమా లో కూడా అతనికి మంచి పేరు వచ్చింది.

*హీరోయిన్ రీతూ వర్మ గురించి?

పెళ్లి చూపులు చిత్రం లో హీరోయిన్ గా నటించింది అనే కంటే జీవించింది అనొచ్చు. అంత బాగా కష్ట పడింది. మాకు మేజర్ హైలెట్ గా ఆమె పార్టిసిపేట్ వుంది.

* మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి చెప్తారా ?

నేను తీసిన సైన్మా అనే షార్ట్ ఫిలిం నే డెవలప్ చేసి ఫీచర్ ఫిలిం గా తియ్యాలన్న ఆలోచన ఉంది. అది సురేష్ బాబుగారికి నచ్చాలి. ఈ సినిమా తరువాత సురేష్ బాబుగారు నన్ను పిలిచి ఇకపై ఇలాగే చిన్న బడ్జెట్ లో మంచి సినిమాలు తీస్తావా లేకపోతే పెద్ద హీరోలతో చేస్తావా అని అడిగారు. నేను మంచి సినిమాలే తీస్తానన్నాను. ప్రస్తుతానికి ఆయన రానా, నాగ చైతన్య ల ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అవన్నీ అవగానే ఖచ్చితంగా కూర్చొని డిస్కస్ చేసుకుంటాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్ అలర్ట్…బీఆర్ఎస్ కోవర్టులపై యాక్షన్..!!

కాంగ్రెస్ సర్కార్ ను బద్నాం చేసేందుకు ఆయా శాఖల అధికారులు కుట్రలు చేస్తున్నారా..? గోప్యంగా ఉంచాల్సిన కీలక సమాచారాన్ని బీఆర్ఎస్ కు చేరవేస్తున్నారా..? ఇరిగేషన్ , విద్యుత్ శాఖలో మాత్రమే కాకుండా ఇతర...

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close