ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కిన ‘శంబాల’ చిత్రంపై ఉన్న అంచనాల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లు, పోస్టర్లు, పాటలు ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. డిసెంబర్ 25న ఈ చిత్రం రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే. అయితే మూవీ మీదున్న నమ్మకంతో డిసెంబర్ 24న ప్రీమియర్లను ప్లాన్ చేశారు. ఈ ప్రీమియర్లకు సంబంధించిన బుకింగ్స్‌ను రీసెంట్‌గానే ఓపెన్ చేశారు. అలా టికెట్లు ఓపెన్ చేస్తున్నారో లేదో.. ఇలా సోల్డ్ అవుట్ అని కనిపిస్తున్నాయి.
హాట్ కేకుల్లా ‘శంబాల’ ప్రీమియర్ షో టికెట్లు సేల్ అవుతున్నాయి. కంటెంట్ ఉన్న చిత్రాల్ని చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని చూపుతారని ఇదే నిదర్శనం. టీజర్, ట్రైలర్లు నచ్చితే, సినిమాలో కంటెంట్ ఉందని ఆడియెన్స్ అనుకుంటే ఇలానే రెస్పాన్స్ ఉంటుంది అని మరొక్కసారి తెలస్తుంది. ప్రస్తుతం ‘శంబాల’ మీదున్న పాజిటివ్ వైబ్స్ టికెట్లు తెగే విధానంలోనే కనిపిస్తోంది. ఆది ఈ సారి బ్లాక్ బస్టర్ కొట్టాలని, కొట్టబోతోన్నాడని ఆడియెన్స్ అంతా అనుకుంటున్నారు. దానికి తగ్గట్టే ప్రీమియర్ షోల టికెట్లు కూడా అమ్ముడవుతున్నాయి.
ఈ చిత్రానికి ప్రవీణ్ కె బంగారి విజువల్స్, శ్రీ చరణ్ పాకాల ఆర్ఆర్ ప్రధాన ఆకర్షణ కానున్నాయన్న సంగతి తెలిసిందే. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి భారీ ఎత్తున నిర్మించిన ఈ సినిమాకు యగంధర్ ముని దర్శకత్వం వహించారు. అయితే రిలీజ్‌కు ముందే అన్ని రకాల హక్కుల్ని ఫ్యాన్సీ రేట్లకు అమ్మడంతో నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్స్‌లో ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఇక ప్రీమియర్ షోల నుంచి వచ్చే పాజిటివ్ టాక్‌తో డే వన్ నుంచి కలెక్షన్ల వర్షం కురిసేలా ఉంది.
