కేసీఆర్పై ఫోన్ ట్యాపింగ్ కేసును నిరూపించడం అసాధ్యమని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తేల్చారు. ఈ వారం కొత్త పలుకులో ట్యాపింగ్ కేసుతో పాటు లడ్డూ కల్తీ కేసును విశ్లేషించింది అటు జగన్, ఇటు కేసీఆర్ ఇద్దరూ ఒకే రకమైన వ్యూహంతో రాజకీయం చేస్తున్నారని తేల్చారు. ముఖ్యంగా కేసీఆర్కు ఊరట కల్పించే మాటలు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ చేయమని ఆయన ఫైల్ పై సంతకం చేయరు కాబట్టి నిరూపించడం సాధ్యం కాదని ఆర్కే చెబుతున్నారు. అయితే దిగువస్థాయి అధికారులు ట్యాపింగ్ కోసం అందరి పేర్లను నక్సలైట్ల జాబితాలో చేర్చడం వల్ల వారికి దొరికిపోయారని మాత్రం తేల్చారు.
బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా ఉండటంతో కనీసం ఈ నోటీసులతో అయినా సెంటిమెంట్ రగిల్చి రాజకీయంగా బలపడదామని బీఆర్ఎస్ అనుకుంటోందని కానీ ప్రజలు మాత్రం అలా అనుకోవడం లేదని అసలు పట్టించుకోవడంలేదని ఆర్కే ప్రకటించేశారు. తనను తాను తెలంగాణ జాతిపితగా పేర్కొన్నా ప్రజలు మాత్రం .. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినా.. విచారణకు హాజరైనా పట్టించుకునేవారు మాత్రం లేరని ఆర్కే తేల్చేశారు. ఇంకా ఘోరం ఏమిటంటే ఎవరైనా చనిపోయినప్పుడు ఏడవడానికి కొంత మందిని పిలిపించుకుని ఏడిపించుకున్నట్లుగా సోషల్ మీడియా సైన్యాన్ని పెట్టుకుని ఏడిపించుకుంటున్నారని సెటైర్ వేశారు. వైసీపీకీ ఇది వర్తిస్తుంది. అంటే సోషల్ మీడియా సైనికుల్ని అంత ఘోరంగా ఆర్కే తీసి పడేశారన్నమాట.
ఇక్కడ కేసీఆర్ రెండు రాష్ట్రాల ప్రతిపక్షాల మధ్య పోలికలు చూపెట్టారు. ఇద్దరి వ్యూహాలు ఒక్కటే. జగన్, కేసీఆర్ పాలనలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోలేదు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారు .. క్షుద్రమైన రాజకీయ కుట్రలే చేస్తూ ప్రజలకు ఇంకా దూరమవుతున్నారు కానీ దగ్గర కావడం లేదని ఆయన తేల్చేస్తున్నారు. ప్రజల్ని మెప్పించడం కన్నా… కూటమి ఎమ్మెల్యేలపై హనీట్రాప్లకుపాల్పడటం జగన్ చేస్తూంటే … రేవంత్ పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం.. ఆయనపై కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసంతృప్తి పెంచే రాజకీయాలు చేయడం బీఆర్ఎస్ చేస్తోందని తేల్చారు.
అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది .. ప్రతిపక్షాలపై కఠినంగా ఉండాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలకు ఆర్కే ఇచ్చిన సందేహమే. ఫినిషింగ్ టచ్ గా ఎక్కడైనా విపక్షాలకు ప్రభుత్వాల నుంచి ఇబ్బందులు వస్తాయి కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వాలకు విపక్షాల నుంచే ఇబ్బందులు వస్తున్నాయని.. తెలుస్తోందా అని ముగించారు.. అంటే..ఇబ్బందులు పడటం కాదు.. పెట్టాలి అని సలహా ఇచ్చారన్నమాట. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఆ పని రేవంత్ చేస్తారని హింట్ కూడా ఇచ్చారు. ఎంతైనా ఆర్కే.. ప్రభుత్వాధినేతలకు బహిరంగసలహాలు తన కొత్తపలుకు ద్వారా ఇస్తారు. వాటిని పాటిస్తారో లేదో వారిష్టం.

