మహారాష్ట్రలోని నాసిక్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ క్యాంపస్ లో లవ్ జీహాద్ వ్యవహారం కలకలం రేపుతోంది. కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని కొందరు టీమ్ లీడర్లు లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా, వారిని మత మార్పిడికి ప్రేరేపిస్తున్నారనే ఆరోపణలు సంచలనంగా మారాయి. కార్పొరేట్ జీహాద్ పిలుస్తూ ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది.
ఆఫీసులోని టీమ్ లీడర్లు , ఇంజనీర్లు తమను గత కొంతకాలంగా వేధిస్తున్నారని మహిళా ఉద్యోగుల ఫిర్యాదు చేశారు. బాధితులతో బలవంతంగా నమాజ్ చేయించడం, ఉపవాసం ఉండేలా ఒత్తిడి తీసుకురావడం వంటివి చేశారని ఆరోపణలు ఉన్నాయి. కెరీర్లో ఎదుగుదల, ప్రమోషన్లు, అధిక జీతాలు ఇప్పిస్తామని ఆశచూపి, వారిని మత మార్పిడి దిశగా మళ్లించేందుకు కుట్ర పన్నారని బాధితులు పోలీసులకు వివరించారు.
ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన నాసిక్ పోలీసులు ఇప్పటికే ఆరుగురు టీసీఎస్ ఉద్యోగులను అరెస్టు చేశారు. వీరిలో కీలక హోదాల్లో ఉన్న వ్యక్తులు ఉన్నారు. వీరిపై లైంగిక వేధింపులతో పాటు మత మార్పిడి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో హెచ్.ఆర్ విభాగానికి చెందిన కొందరి పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతుండటంతో పోలీసులు ఆ కోణంలో విచారణ జరుపుతున్నారు.
మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ ఈ ఉదంతాన్ని తీవ్రంగా ఖండించారు. ఒక ప్రతిష్టాత్మక ఐటీ సంస్థలో ఇలాంటి వ్యవస్థీకృత నేరాలు జరగడం దిగ్భ్రాంతికరమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు, టీసీఎస్ సంస్థ సైతం ఈ ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించింది. మహిళా భద్రత , ర్యాలయాల్లో మతపరమైన ఒత్తిళ్లపై ఈ ఘటన కొత్త చర్చకు తెరలేపింది.


