ప్రత్యేక హోదా గురించి వెంకయ్య మళ్ళీ మాట్లాడారు

ఏపీకి ప్రత్యేక హోదా గురించి ఎవరు మాట్లాడినా అందరూ మరిచిపోకుండా తప్పకుండా మాట్లాడే విషయం ప్రత్యేక హోదా కోసం ఆనాడు వెంకయ్యనాయుడు పార్లమెంటులో చేసిన డిమాండ్, ఆ తరువాత దానిపై ఆయన మాటలు మార్చడం గురించి. అందుకే ఆయన ఈమధ్య దాని ఊసే ఎత్తడం మానుకొన్నారు. కానీ ఈరోజు తాడేపల్లి గూడెంలో నిట్ శంఖుస్థాపన సందర్భంగా మళ్ళీ దాని గురించి మాట్లాడారు.

రాష్ట్రాన్ని అపరిపక్వంగా విడగొట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చాలా అన్యాయం చేసిందని, ఇప్పుడు ఆ పార్టీ ప్రత్యేక హోదా గురించి పోరాడటం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ ప్రయోజనాలను కాపాడేందుకు తను చేసిన పోరాటం గురించి ప్రజలకి తెలుసని అన్నారు. కాంగ్రెస్ పార్టీలాగా తను ఓట్ల కోసం, సీట్ల కోసం ఎన్నడూ రాజకీయాలు చేయలేదని అన్నారు. తను స్వయంకృషితో పైకి వచ్చేను తప్ప వారసత్వ రాజకీయాల ద్వారా పదవులు, అధికారం పొందలేదని అన్నారు. పదవులు అధికారం కోసం చొక్కాలు మార్చినట్లుగా పార్టీలు మార్చేవారు, బేరసారాలాడేవారు కూడా తనని కేంద్రప్రభుత్వం విమర్శిస్తున్నారని ఆయన ఎద్దేవా చేసారు. ఈ ఏడాదిన్నర కాలంలో కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఏమేమీ చేసిందనే విషయాల గురించి మాట్లాడకుండా ఇంకా ఇవ్వనివాటి గురించి మాత్రమే మాట్లాడుతూ రాష్ట్రంలో కొన్ని రాజకీయపార్టీలు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. కేంద్రప్రభుత్వం 14వ ఆర్ధిక సంఘం నివేదిక ఆధారంగా ప్రత్యేక హోదా అంశాన్ని పరిశీలిస్తోందని అన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తామని, వాటిలో ఇప్పటికే చాలా అమలుచేసామని, మిగిలినవి కూడా త్వరలోనే అమలుచేస్తామని అన్నారు. రాష్ట్రానికి రైల్వేజోన్ ఏర్పాటుపై కసరత్తు జరుగుతోందని త్వరలోనే ఏర్పాటుజరిగే అవకాశం ఉందని తెలిపారు.

నిజమే! ఈ ఏడాదిన్నర కాలంలో కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి అనేక ఉన్నత విద్యాసంస్థలు, నిధులు కూడా మంజూరు చేసింది. కానీ అన్నిటికంటే ముఖ్యమయిన ప్రత్యేక హోదా, రైల్వేజోన్ ఇంతవరకు మంజూరు చేయలేదు. ప్రత్యేక హోదాకి 14వ ఆర్ధిక సంఘం అభ్యంతరాలు చెపుతోందని, రైల్వేజోన్ ఏర్పాటుకు ఆర్ధిక మంత్రిత్వశాఖ అనుమతులు మంజూరు చెయ్యలేదని చెపుతున్నారు. కానీ బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్ర మోడీ ఆ రాష్ట్రానికి ఏకంగా రూ. 1.65 లక్షల కోట్లు మంజూరు చేస్తున్నట్లు మొన్న ప్రకటించారు. దానికి ఏ ఆర్ధిక సంఘం అభ్యంతరం చెప్పినట్లు లేదు. అందుకు నిధుల కొరత అడ్డంకి కాలేదు.

ఏ సమస్యాలేని బీహార్ రాష్ట్రానికి అన్ని లక్షల కోట్లు మంజూరు చేయగలిగినప్పుడు సహాయం చేస్తామని హామీ ఇచ్చిన ఆంద్రప్రదేశ్ కి కనీసం ఆ మాత్రం అయినా ఎందుకు మంజూరు చేయడంలేదు అని మోడీని గట్టిగా ప్రశ్నించలేకపొతున్నారు. ఆనాడు వెంకయ్యనాయుడు పార్లమెంటులో రాష్ట్రం కోసం అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని చాలా ప్రాధేయపడ్డారు. కానీ ఇప్పుడు తమ పార్టీయే అధికారంలో ఉన్నప్పుడు మోడీని ఎందుకు ఒప్పించలేకపోతున్నారు? అనే సందేహం కలుగుతుంది. బీహార్ రాష్ట్రానికి అంత భారీ ఆర్ధిక ప్యాకేజి ప్రకటించిన తరువాత కూడా నేటికీ వెంకయ్య నాయుడు 14వ ఆర్ధిక సంఘం, ప్రత్యేక హోదా, కేంద్రం, పరిశీలన అంటూ పాతపాతనే పాడుతుండటం గమనార్హం.

అయినా ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య నాయుడుని ఒక్కరినే తప్పు పట్టలేము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రెంటినీ తప్పుపట్టవలసి ఉంటుంది. కానీ ఇంకా ఇలాగే మభ్యపెడుతూ రోజులు దొర్లించేయడం రెంటికీ పెద్ద కష్టమేమీ కాకపోవచ్చును. కానీ వచ్చే ఎన్నికలలో దానికి ఆ రెండు పార్టీలు తప్పక మూల్యం చెల్లించవలసి వస్తుందని గ్రహిస్తే వాటికే మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close