రివ్యూ : జనతా గ్యారెజ్ – బలం బాగుంది… బట్ బలహీనతలు బలంగా ఉన్నాయి

ఇంట్రడక్షన్ః

మాస్ హీరోయిజం, వంశం గురించి డైలాగ్స్, కొడితే ఇండస్ట్రీ రికార్డ్ బద్ధలైపోవాలి…..ఎన్టీఆర్‌లో అన్నీ ఇలాంటి ఆలోచనలే ఉంటాయని మొన్నటి వరకూ అందరూ భావించారు. కానీ ‘నాన్నకు ప్రేమతో’ సినిమా నుంచి ఎన్టీఆర్‌లో అసాధారణ మార్పు కనిపిస్తోంది. స్టార్ ట్యాగ్ వద్దంటున్నాడు. ఓ నటుడిగా మంచి కథలలో భాగమవ్వాలనుకుంటున్నాడు.టెంపర్ నుంచి కథల సెలక్షన్‌ విషయంలో కూడా ఎన్టీఆర్ ఆలోచనా విధానం చాలా మారింది. అందుకే టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాలతో మంచి హిట్స్ కొట్టాడు. ఇప్పుడిక ‘జనతా గ్యారేజ్’ కథ గురించి కూడా చాలా చాలా చెప్పాడు ఎన్టీఆర్.గ్యారేజ్ రిలీజ్ తర్వాత తెలుగు ఇండస్ట్రీ కథలు మారిపోతాయని చెప్పుకొచ్చాడు. నిజంగా కథలో అంత విషయం ఉందా? ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో టాప్‌ రేంజ్‌కి దూసుకెళ్ళిన కొరటాల మరోసారి తన మేజిక్ రిపీట్ చేయగలిగాడా? సినిమాకు హైప్ తీసుకురావడంలో జనతా గ్యారేజ్ టీం మొత్తం కూడా సర్దార్, బ్రహ్మోత్సవాల కంటే ఎక్కువ సక్సెస్ అయింది. మరి ఆ అంచనాలకు తగ్గ అవుట్ పుట్ ఇవ్వగలిగారా?

స్టోరీః

ఒక రొటీన్ మాస్ కథను తీసుకుని తనదైన క్లాస్ ట్రీట్‌మెంట్‌తో మెప్పించడం కొరటాల శివ స్పెషాలిటి. హీరో క్యారెక్టరైజేషన్, సీన్స్ విషయంలో కూడా కొత్తదనం ఉండేలా జాగ్రత్తపడతాడు.ఈ సినిమాలోనూ అదే చేశాడు. ఏ మనిషి అయినా కష్టాల్లో ఉన్నాడు అంటే చాలు…వెళ్ళి సాయపడడం సత్యం(మోహన్‌లాల్) లైఫ్ స్టైల్. అతను ఓ మెకానిక్. బ్రతుకుదెరువు కోెసం జనతా గ్యారేజ్‌లో వెహికల్స్‌ని రిపేర్ చేస్తూ ఉంటాడు. అది అతని వృత్తి. మనుషులు మనుషుల్లా బ్రతికుండాలన్న ఆశయంతో సమాజంలో ఉన్న చెడ్డవాళ్ళను రిపేర్ చేస్తూ ఉంటారు. అది అతని ప్రవృత్తి. ఆ జనతా గ్యారేజ్ valla అతను ఏం నష్టపోయాడు? తనకు వయసైపోయిన పరిస్థితులు వచ్చేసరికి ఆనంద్ (ఎన్టీఆర్) అనే కుర్రాడు ఆ జనతా గ్యారేజ్‌కి ఎందుకు వచ్చాడు? ముంబైలో ఎన్విరాన్‌మెంట్ గురించి స్టడీ చేస్తూ..ప్రకృతికి ఎవరు నష్టం కలిగించినా వాళ్ళ తాటతీసే ఆనంద్‌కి జనతా గ్యారేజ్‌తో ఉన్న రిలేషన్ ఏంటి? సత్యం, ఆనంద్‌లు కలిసి జనతా గ్యారేజ్‌ని ఎలా నడిపారు? సమంతా, నిత్యామీనన్‌లతో ఆనంద్‌కు ఉన్న రిలేషన్ ఏంటి? అనేది కథ.

ఆర్టిస్ట్స్ః
జనతా గ్యారేజ్‌కి సంబంధించినంత వరకూ ఫస్ట్ అండ్ ఫోర్‌మోస్ట్ మోహన్ లాల్ గురించే చెప్పాలి. ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎక్కడా హడావిడి లేకుండా కళ్ళతోనే చాలా భావాలను ఎక్స్‌ప్రెస్ చేయగలిగారు. సత్యం క్యారెక్టర్‌కి జీవం పోశారు. అయితే ఎన్టీఆర్ కూడా ఎక్కడా తగ్గలేదు. సినిమా సినిమాకు తన యాక్టింగ్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నాడు. ఎన్టీఆర్ నటనను చూస్తుంటే సినిమా ప్రారంభంలో కాసేపు ‘నాన్నకు ప్రేమతో’ సినిమా గుర్తొస్తుంది కానీ ఆ తర్వాత మాత్రం పూర్తిగా ఆనంద్‌ క్యారెక్టర్‌లోకి ఎంటర్ అయ్యాడు. ఎన్టీఆరే చెప్పుకున్నట్టుగా జనతా గ్యారేజ్‌లో తను కూడా ఓ గొప్ప క్యారెక్టర్ చేశాడు. ఆ క్యారెక్టర్‌కి జీవం పోశాడు. దేవయానితో ‘నేనున్నానమ్మా..’ అనే డైలాగ్ చెప్పిన సీన్‌లో కానీ, అంతకుముందు జనతా గ్యారేజ్ కోసం ఓ గొప్ప త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చిన సీన్‌లో కానీ ది బెస్ట్ అనిపిస్తాడు. అలాగే స్పెషల్ సాంగ్‌తో పాటు యాపిల్ బ్యూటీ సాంగ్‌లో కూడా ఎన్టీఆర్ డ్యాన్స్ చాలా బాగుంది. సమంతా, నిత్యామీనన్‌లకు ఉన్న స్కోెప్ చాలా తక్కువ. ఉన్నంతలో నిత్యామీనన్ మాత్రం తన మార్క్ చూపించింది. తన ప్రజెన్స్ గుర్తించేలా చేసింది. రాజీవ్ కనకాల యాక్టింగ్ కూడా బాగుంది. సమంతా మేకప్, కాస్ట్యూమ్స్ బ్యాడ్‌గా ఉన్నాయి.

టెక్నికల్ః
సాంకేతికంగా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. ఫొటోగ్రఫి చాలా బాగుంది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వర్క్ కూడా ఇంప్రెసివ్‌గా ఉంది. జనతా గ్యారేజ్ చుట్టూ చాలా పెద్ద కథను అల్లుకున్నాడు కొరటాల. ఆ కథ మరీ పెద్దదయిపోవడంతో ఎడిటింగ్ విషయంలో తప్పటడుగులు పడ్డాయి. చివరి నిమిషంలో కూడా పది నిమిషాల సినిమాను ఎడిట్ చేయడంలాంటి వాటి ఎఫెక్టేమో కానీ జర్క్‌లు బాగానే కనిపిస్తాయి.చాలా ఎక్కువ విషయాలు చెప్పాలన్న ప్రయత్నంలో కథనంపైన గ్రిప్ మిస్సయ్యాడు కొరటాల. ఆ ఎఫెక్ట్ సినిమాపైన పడింది.

ఎన్విరాన్‌మెంటల్ స్టూడెంట్‌గా ఎన్టీఆర్ యాక్టివిటీస్, సమంతాతో లవ్ స్టోరీ, ఆ తర్వాత జనతా గ్యారేజ్ యాక్టివిటీస్‌, ఎన్టీఆర్ ఫ్యామిలీ స్టోరీ…….అన్నింటికీ మించి సినిమాను ముగించడం కోసం ముఖ్యమంత్రి మార్పు అనే భారీ థాట్…అందుకోసం బాంబ్ బ్లాస్ట్స్ కాన్సెప్ట్… అన్నీ కూడా అనవసర బ్యాగేజ్ అయిపోయాయి. డైలాగ్స్ బాగున్నాయి. కామెడీ విషయంలో కొరటాల శివ బలహీనతలన్నీ వెన్నెల కిషోర్ సీన్‌లో బయటపడతాయి. దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం అక్కడక్కడా ఓవర్ ది బోర్డ్ వెళ్ళాడు.కొరియోగ్రఫర్స్, ఫైట్ మాస్టర్స్ వర్క్ బాగుంది.

హైలైట్స్ః

  • మోహన్ లాల్, ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్
  • జనతా గ్యారేజ్ కథ
  • సాంగ్స్, ఫైట్స్
  • సెంటిమెంట్ సీన్స్
  • ఫొటోగ్రఫి
  • ప్రి ఇంటర్వెల్, పోస్ట్ ఇంటర్వెల్ సీన్స్

డ్రాబ్యాక్స్ః

  • లవ్ స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ, జనతా గ్యారేజ్ స్టోరీలు చెప్పాలన్న ప్రయత్నం గ్రిప్పింగ్‌గా లేదు
  • సీన్స్ ఫ్రెష్‌గా లేకపోవడం
  • కథనం అంతా కూడా ఆడియన్స్ ఊహలకు తగ్గట్టుగానే ఉండడం
  • ఎన్టీఆర్, మోహన్‌లాల్ స్థాయి విలన్ లేకపోవడం

ఎనాలసిస్ః

శ్రీమంతుడు సిినిమా క్లైమాక్స్ విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. ఆ అనుభవంతో ఈ సారి మరింత ఎఫెక్టివ్‌గా క్లైమాక్స్ ప్లాన్ చేసుకోవాల్సిన కొరటాల…అంతకంటే తక్కువ స్టాండర్డ్స్‌లో ఉన్న క్లైమాక్స్‌ని చూపించాడు. ఆ ఇంపాక్ట్ సినిమాపైన పడింది. ప్రి ఇంటర్వెల్, పోస్ట్ ఇంటర్వెల్ సీన్స్‌లో అద్భుతం అనే స్థాయిలో ఇంప్రెస్ చేసే కొరటాల క్లైమాక్స్ విషయంలో మాత్రం సాదాసీదాగా కనిపిస్తున్నాడు. పాత కథలను కొత్తగా చెప్పడం అన్న కొరటాల స్టైల్‌ని తప్పు పట్టలేం. కానీ మిర్చి, శ్రీమంతుడు సినిమాల్లో సీన్స్ చాలా కొత్తగా ఉంటాయి. బాగుంటాయి. కానీ జనతా గ్యారేజ్ సినిమాలో ఆ మేజిక్‌ని కంటిన్యూ చేయలేకపోయాడు. కొన్ని సీన్స్ అయితే మరీ ఓల్డ్‌గా, సీరియల్ స్టాండర్ట్స్‌లో ఉండి బోర్ కొట్టించేస్తాయి.

ఈ లోపాలు పక్కన పెడితే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోను, మిగతా అందరినీ కూడా కథలో భాగంగా చూపించడంలో మాత్రం కొరటాల సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా బలం కూడా అదే. సినిమాలో ఉన్న కొత్తదనం కూడా అదే. జనతా గ్యారేజ్‌ని కూడా ఓ క్యారెక్టర్‌గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఆ ఆలోచన వరకూ సూపర్బ్. కథకు అస్సలు సంబంధం లేకుండా, లాజిక్కులన్నీ వదిలేసి బాంబ్ బ్లాస్ట్ లాంటి సీన్స్, క్లైమాక్స్ కాకుండా ఇంకొంచెం బెటర్‌గా ఏదైనా ట్రై చేసి ఉంటే మాత్రం కొరటాల కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడేది.

ఫైనల్ రిజల్ట్ః జనతా గ్యారేజ్ బలంగా ఉంది. బట్ బలహీనతలు కూడా బలంగానే ఉన్నాయి

తెలుగు360 రేటింగ్ః 3/5

నటీనటులుః ఎన్టీఆర్, మోహన్‌లాల్, సమంతా, నిత్యామీనన్, ఉన్ని ముకుందన్
మ్యూజిక్ః దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫిః తిరునవుక్కరసు
ఎడిటింగ్ః కోటగిరి వెంకటేశ్వరరావు
ప్రొడ్యూసర్స్ః నవీన్ యర్నేని, వై. రవిశంకర్, సి.వి. మోహన్
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ః కొరటాల శివ
ప్రొడక్షన్ కంపెనీః మైత్రీ మూవీ మేకర్స్
రిలీజ్ డేట్ః 01.09.2016

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఫిక్స్ అయిపో..!?

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మనాభం అని కాకుండా పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటానని సవాల్ చేశారు. ముద్రగడ ధీమా ఏంటో...

నన్ను పట్టించుకోరా… ఓ తండ్రి అనూహ్య నిర్ణయం

కని పెంచిన కొడుకులు పట్టించుకోలేదని నిరాశ చెందిన ఓ తండ్రి అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. రెక్కల కష్టంతో పెంచిన కొడుకులు తనను పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో యావదాస్తిని కొండగట్టు ఆంజనేయ స్వామికి సమర్పించేందుకు...

డైరెక్ట‌ర్స్ డే… రాజ‌మౌళి ‘డాన్స్’ షో!

ద‌ర్శ‌క దిగ్గ‌జం దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌యంతిని పుర‌స్క‌రించుకొని, తెలుగు ద‌ర్శ‌కులంతా క‌లిసి 'డైరెక్ట‌ర్స్ డే'ని సెల‌బ్రేట్ చేసుకోబోతున్నారు. మే 4న ఈ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రగ‌బోతోంది. అందుకోసం ద‌ర్శ‌కులంతా క‌లిసి క‌స‌ర‌త్తులు చేస్తున్నారు....

ఏప్రిల్‌ బాక్సాఫీస్ రివ్యూ: అంతా చ‌ప్పచ‌ప్ప‌గా!

2024లో అప్పుడే 4 నెల‌లు గ‌డిచిపోయాయి. జ‌న‌వ‌రి సంక్రాంతి సినిమాల ద‌య వ‌ల్ల `ఓకే` అనిపించుకొంది. ఫిబ్ర‌వ‌రిలో అన్నీ ఫ్లాపులే. మార్చి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఓం భీమ్ భుష్‌, ప్రేమ‌లు, టిల్లూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close