ప్యాకేజే గొప్పది మహానుభావా… అనేవరకూ ఈ డ్రామాలు ఆపరా ?

ప్రపంచానికి పాఠాలు చెప్పాను అనే స్వోత్కర్ష నుంచి బోలెడన్ని విషయాలను నేనే కనిపెట్టాను. చాలా మంది విజయాలకు నేనే కారణం అనే వరకూ… సక్సెస్ క్రెడిట్‌ని కొట్టేయడం కోసం పడరాని ప్రచార పాట్లు పడుతూ ఉంటాడు చంద్రబాబు. కానీ నిజంగా ఆయన కనిపెట్టిన విషయం అని అనలేం గానీ….. ప్రచారం ఒక్కటి మన చేతుల్లో ఉంటే చాలు…..అధికారంలోకి వచ్చెయ్యెచ్చు. అధికారంలో ఉన్నవాళ్ళను దించెయ్యుచ్చు అని భారతదేశానికి పాఠాలు చెప్పిన నేత మాత్రం చంద్రబాబే. మీడియాను వాడుకోవడం, ప్రచారం చేసుకోవడం, చేయించుకోవడం.లాంటి వాటిల్లో చంద్రబాబును మించినోడు లేడు. ‘నా వాడకం ఎలా ఉంటుందంటే…’ అని అదేదో తెలుగు సినిమాలో ఓ స్టార్ హీరో చెప్పినట్టుగా భారతదేశం మొత్తం మీద మీడియాని చంద్రబాబు రేంజ్‌లో వాడిన నాయకుడు మరొకరు లేరు. నరేంద్రమోడీ మాత్రం 2014లో ప్రధాని అవడం కోసం ‘అంతకుమించి’ అనే స్థాయిలో వాడేశాడు. ఆ ఒక్క సందర్భం మినహాయిస్తే ఇండియన్ పాలిటిక్స్‌లో చంద్రబాబు కంటే ఎక్కువగా పబ్లిసిటీ ట్రిక్స్ పైన డిపెండ్ అయిన నేత మరొకరు కనిపించరు.

ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజ్ విషయంలో కూడా అదే పబ్లిసిటీ టెక్నిక్స్‌ని ఇంతకుముందు ఎప్పుడూ చూడనంత స్థాయిలో వాడేస్తున్నాడు చంద్రబాబు. అగ్నికి వాయువు తోడైనట్టు ఈ సారి నరేంద్రమోడీ పబ్లిసిటీ టెక్నిక్స్ కూడా చంద్రబాబు ప్రచార ట్రిక్స్‌కి తోడయ్యాయి. రాష్ట్ర విభజన బిల్లుకు అనుకూలంగా టిడిపి, బిజెపి ఎంపీలు ఓటేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడంలో సక్సెస్ అయ్యారు చంద్రబాబు, మోడీ. ఎంపి సీట్లు కూడా భారీగానే గెల్చుకున్నారు. అలాగే తెలంగాణా ఏర్పాటుకు మేమే కారణమని అక్కడ కూడా అధికారంలోకి రావాలని భారీ స్కెచ్ వేసుకున్నారు. కానీ అంతకుముందే తెలంగాణా అంతటా కూడా ఆంధ్రా మీడియా అని చెప్పి మెయిన్ స్ట్రీమ్ మీడియా నిజస్వరూపాన్ని తెలంగాణా ప్రజలకు తెలియచెప్పడంలో కెసీఆర్ సక్సెస్ అయి ఉన్నాడు కాబట్టి అక్కడ మాత్రం వీళ్ళ పప్పులు ఉడకలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల విషయంలో మాత్రం తన ప్రచార చిత్రాలు కచ్చితంగా సూపర్ హిట్ అవుతాయని చంద్రబాబు గట్టి నమ్మకం. అందుకే ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో కూడా అవే ట్రిక్స్ వాడేస్తున్నాడు. ప్రత్యేక హోదా వద్దు. ప్యాకేజీనే ముద్దు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పేవరకూ వదిలేలా లేరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలెవ్వరూ ప్రత్యేక హోదాను కోరుకోవడం లేదని, ఒకవేళ కొంత మంది ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నా వాళ్ళకు ప్రత్యేక హోదా గురించి ఏమీ తెలియదని ఓవైపు ఆంధ్రజ్యోతిలో అడ్డమైన రాతలూ రాయిస్తూ ఉన్నారు. హోదా కంటే ప్యాకేజ్‌నే గొప్ప అని ఆంధ్రప్రదేశ్ ప్రజల చేత చెప్పించడానికి రాధాకృష్ణగారు తన శక్తిమేరకు ప్రయత్నాలు చేస్తున్నారు. తన విశ్శసనీయత దెబ్బతినకుండా ఉండేలాగా జాగ్రత్తపడుతూ ఈనాడువారు కూడా చాలా తెలివిగా అదే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరోవైపు వెంకయ్యనాయుడు సన్మానాల డ్రామాకు తెరలేపారు. ప్యాకేజ్‌కి ముచ్చటపడిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కలిసి వెంకయ్యకు సన్మానాలు చేస్తున్నారన్నంత బిల్డప్పులు ఇచ్చేస్తున్నారు. అలాగే మీడియాలో ప్యాకేజ్ గొప్పదనం గురించి ప్రచార ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అండ్ కో కూడా ప్రత్యేక హోదాను తక్కువ చేయడానికి, ప్యాకేజ్ గొప్పదనం గురించి చెప్పడానికి ప్రతి రోజూ కష్టపడుతూనే ఉన్నారు. అలాగే ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటాలను అణచివేయడానికి అన్ని శక్తులనూ వాడేస్తున్నారు. త్వరలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా సన్మానాలు చేయించుకోవడానికి, ప్యాకేజ్ గొప్పదనం గురించి చెప్పడానికి ఆంధ్రప్రదేశ్‌కు రాబోతున్నారట.

అంటే ప్రత్యేక హోదా వద్దు…..ప్యాకేజీనే ముద్దు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ముక్తకంఠంతో ఒప్పుకునేవరకూ వాళ్ళను వదిలిపెట్టరన్నమాట. ఈ మాయమాటల గొప్ప ప్యాకేజీని ప్రకటించినందుకు 2019లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మరో సారి అధికారంలో ఉన్నవాళ్ళకు ఓటేసేలా చేయడం కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు షురూ చేశారన్నమాట. ఈ మొత్తం పరిణామాలన్నీ చూస్తూ ఉంటే ఒక్క విషయం మాత్రం చెప్పాలనిపిస్తోంది. తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి…ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారం చేసుకోవడం చేతకాక సోనియాగాంధీ విలన్ అయింది కానీ…… చంద్రబాబు, మోడీలు కలిసి ఉన్న ఎన్టీయే ప్రభుత్వం కనుక ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఉంటే….ఆ విభజన తెలంగాణా కంటే ఆంధ్రప్రదేశ్‌కే ఎక్కువ ప్రయోజనకరం అని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఒప్పించి ఉండేవాళ్ళనడంలో సందేహం లేదు. అలాగే తెలంగాణాలో కూాడా చాలా సులభంగానే అధికారంలోకి వచ్చి ఉండేవాళ్ళు.

ఎన్టీఆర్‌ని గద్దె దించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినప్పటి నుంచీ ఈ క్షణం వరకూ చంద్రబాబు రాజీకయ జీవిత చరిత్రను మొత్తం పరిశీలిస్తే ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమువుతుంది. ప్రచారం విషయంలో చంద్రబాబును కొట్టేటోడు మొత్తం దేశంలోనే ఇంకొక్కరు లేరు అని. ఎనీ డౌట్స్?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close