రాధిక మరో సంచలనం : ఓ హీరో నన్ను రూమ్ కి పిలిచాడు

ఈ మధ్య సంచలనాలకు చిరునామాగా మారింది రాధికా ఆప్టే. పర్చేద్ న్యూడ్ వీడియో బయటకి వచ్చాక రాధికా మరింత పాపులర్ అయ్యింది. రజనీకాంత్ తో సినిమా చేసినా రానంత ప్రచారం ఈ ఒక్క వీడియో తెచ్చిపెట్టింది. ఇప్పుడు రాధిక మరో సంచలనాకికి కేంద్ర బిందువు అయ్యింది. ఓ ఇంటర్వ్యూ లో రాధికా మాట్లాడుతూ సౌత్ ఇండియన్ హీరో ఒకరిని ఎండగట్టింది. ఓ హీరో తో సినిమా చేస్తున్నప్పుడు… రాత్రికి రూమ్ కి వస్తావా అని ఆఫర్ చేశాడట. ఆ హీరో పేరు మాత్రం రాధిక చెప్పలేదు.

హీరో అలా అనేసరికి ముందు షాక్ తిన్నానని, ఆ తరవాత గట్టిగా బుద్ధి చెప్పానని అంది. చిత్ర సీమలో ఇలాంటి సన్నివేశాలు హీరోయిన్లకు తరచుగా ఎదురయ్యేవే. కానీ ఎవ్వరూ బయటపడడానికి సాహసం చెయ్యరు. కానీ రాధిక మనసు విప్పి మాట్లాడడం, తనకి జరిగిన అవమానం మీడియా తో పంచుకోవడం హాట్ టాపిక్ గా మారింది. కథానాయికలు అవకాశాల కోసం ఏమైనా చేస్తారనే అపోహ ఉందని.. దాని నుంచి చిత్ర సీమ, ఇక్కడి హీరోలు, దర్శకులు బయటపడాలని కోరుతొంది రాధిక. కొంతమంది ఛాన్సుల కోసం తప్పుదారి పట్టినా వాళ్ళ పరిస్థితిని అర్ధం చేసుకోవాలి తప్ప చులకనగా మాట్లాడొద్దని కోరుతొంది. రాధిక ని అలా అడిగిన ఆ హీరో ఎవరా అనే ప్రశ్న ఇప్పుడు మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close