గుంటూరు పోలీసు హింస ‘విచారణై’ ఆస్కార్‌స్థాయికి….

మరో భారతీయ భాషా చిత్రంవిశారణై ఆస్కార్‌ పోటీలకు అధికార ఎంట్రీగా వెళ్లడం సంతోషమైనా తెలుగు వాళ్లు అందులోనూ గుంటూరీయులు ఒకింత విచారించే విషయం వుంది.తమిళనాడు నుంచి బతుకు తెరువు కోసం నెల్లూరు వచ్చిన యువకులను గుంటూరు పోలీసులు తీవ్రంగా హింసించిన తీరే ఈ కథాంశం. విశారణై అంటే విచారణ.పోలీసు ఇంటరాగేషన్‌. ప్రముఖ కథానాయకుడు ధనుష్‌ వెట్రిమారన్‌ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో దినేష్‌, ఆనంది అచ్చి, కిశోర్‌ మురుగదాస్‌ నటించారు. తమిళనాడుకు చెందిన పోలీసు అధికారిగా వచ్చిన సముద్ర ఖని వీరి గురించి తెలుసుకుని ఎలాగో తప్పిస్తాడు.అయితే అక్కడకు వెళ్లాక మళ్లీ తమిళనాడు రాజకీయవేత్తలు వారిని తమ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తారు. ఈ చిత్రంలో పోలీసుల హింసాకాండను చాలా ‘సహజంగా’చూపించారట. ఎంత అంటే చూసి భరించలేనంత. అందుకే మూడు జాతీయ అవార్డులే గాక 2015 వెనిస్‌ చిత్రోత్సవంలో అంతర్జాతీయ పురస్కారంకూడా పొందింది. ఎం.చంద్రకుమార్‌ అనే ఆటో డ్రైవర్‌ రచయితగా రాసిన లాకప్‌ అన్న నవల ఈ సినిమాకు మూలం.ఈ చిత్రం భారీగా వసూళ్లతో పాటు మంచి పేరు కూడా తెచ్చిపెట్టడం నిర్మాత నటుడు ధనుష్‌కు ఎంతో సంతోషం కలిగించింది.అన్నట్టు ఎర్ర చందనం స్మగ్లింగ్‌ వేటలోనూ తమిళ కూలీలను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంపై సినిమా వున్నట్టుంది. తప్పదు కదా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close