యూరీ ఎఫెక్ట్స్: పాక్ తో కటీఫ్ షురూ

పఠాన్ కోట్ దాడి ప్రభావం నుంచి పాకిస్తాన్ తెలివిగా తప్పించుకోగలిగింది కానీ యూరీ దాడులకి ఆ దేశం మూల్యం చెల్లించవలసి వస్తోంది. ఆ దేశానికిచ్చిన ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదాని రద్దు చేయాలని భారత ప్రభుత్వం భావిస్తున్నట్లు తాజా సమాచారం.

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కూడా పాకిస్తాన్ తో క్రికెట్ ఆడకూడదని నిర్ణయించుకొంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ తీరుని నిరసిస్తూ ఆ దేశంతో ఆడవలసిన ద్వైపాక్షిక సిరీస్ ని రద్దు చేసుకొంటున్నట్లు బీసీసీఐ చైర్మన్ అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు. భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్ 2007లో జరిగింది. మళ్ళీ త్వరలో మరో సిరీస్ ఆడేందుకు రెండు దేశాల క్రికెట్ బోర్డులు ఆలోచిస్తున్న సమయంలో ఈ ఘటన జరుగడంతో క్రికెట్ సంబంధాలు కటీఫ్ అయ్యాయి.

ముంబైలో స్థిరపడి హిందీ సినిమాలలో నటిస్తున్న పాక్ నటీనటులు అందరూ 48గంటలలోగా భారత్ విడిచి వెళ్ళిపోవాలని లేకుంటే తామే వారిని దేశం నుంచి బయటకి తరిమేస్తామని మహారాష్ట్రకి చెందిన నవనిర్మాణ్ సేనకి అనుబంద సంస్థ చిత్రపట్ కర్మచారిసేన హెచ్చరించింది.

పాకిస్తాన్ ఉగ్రవాద దేశమని భారత్ చేస్తున్న వాదనకి మద్దతుగా ఇద్దరు అమెరికన్ సెనేటర్స్ అమెరికన్ కాంగ్రెస్ (పార్లమెంటు)లో బుధవారం ఒక బిల్లుని ప్రవేశపెట్టారు. ఉగ్రవాదంపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేయబడిన హౌస్ సబ్-కమిటీ చైర్మన్ టెడ్-పో ఆ బిల్లుని స్వయంగా కాంగ్రెస్ లో ప్రవేశపెట్టడం విశేషం. దానికి రోహ్ర్ బెచర్ అనే మరో సెనేటర్ మద్దతు పలికారు.

‘పాకిస్తాన్ విశ్వసించదగ్గ స్నేహితుడు కాదు. అమెరికా శత్రువులకి ఆ దేశం చాలా కాలంగా సహాయ సహకారాలు అందిస్తూ మనల్ని మోసం చేస్తూనే ఉంది. ఒబామా బిన్ లాడెన్ కాపాడటం మొదలుకొని హకానీ నెట్ వర్క్ తో దాని రహస్య సంబంధాల వరకు అన్నిటిలో పాకిస్తాన్ హస్తం ఉందని స్పష్టం అయ్యింది. అమెరికాని మోసం చేస్తున్న పాకిస్తాన్ కి ఇక ఆర్ధిక సహాయం చేయడం ఆపివేసి దానిని ఉగ్రవాదం ప్రోత్సహిస్తున్న దేశంగా ప్రకటించాలి,” అని ఆ బిల్లులో పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ కూడా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ని హెచ్చరించారు. ముఖ్యంగా పాక్ అణ్వాయుదాల భద్రత విషయంలో గట్టిగానే హెచ్చరించారు.

యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడు రీసజర్డ్ సీజర్ కూడా పాకిస్తాన్ని చాలా తీవ్రంగా హెచ్చరించారు. బలూచిస్తాన్ పాక్ సేనలు ప్రజలని హింసించడం మానుకాకుంటే పాకిస్తాన్ పై ఆర్ధిక, రాజకీయ ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు.

భారత్ తో సహా ప్రపంచ దేశాలు ఇంత ఒత్తిడి చేస్తున్నా పాక్ ప్రభుత్వం ఏమాత్రం వెనుకంజ వేయకుండా జోరుగా యుద్ద సన్నాహాలు చేస్తూ భారత్ ని కవ్విస్తూనే ఉంది. భారత్ వైపున్న పాక్ ఉత్తర సరిహద్దు ప్రాంతాలలో పాక్ యుద్దవిమానాలు తెగ తిరుగుతున్నాయి. అందుకోసం ఆ ప్రాంతం మీదుగా సాధారణ విమానాల రాకపోకలని పాక్ ప్రభుత్వం నిషేదించడంతో చాలా విమానాలు రద్దు అయ్యాయి. ఆ ప్రాంతంలో ఎం-1, ఎం-2 అనే రెండు ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలని నిలిపివేసి, ఆ రోడ్లపైనే యుద్ద విమానాలు దింపుతూ, టేకాఫ్ చేస్తూ యుద్దసన్నాహాలు చేస్తోంది. భారత్ ని ఎదుర్కోవడానికి తమ సైన్యం సిద్దంగా ఉందని ఆ దేశ సైన్యాధ్యక్షుడు రహెల్ షరీఫ్ ప్రకటించారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఆ వైమానిక కసరత్తు ఐదేళ్ళకోసారి సాధారణంగా జరిగేదే తప్ప యుద్దసన్నాహాలు కావని ఒక పాక్ సైనికాధికారి ఆ దేశంలో ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక డాన్ కి చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అధికారం కోల్పోయినా సరే కానీ… జగన్ టార్గెట్ అదే..!?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం మరో మూడు రోజుల్లో ముగియనుంది. ప్రధాన పార్టీలన్నీ ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు ఎప్పటికప్పుడు పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలను మార్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పిఠాపురంలో పవన్ ఓటమి లక్ష్యంగా వైసీపీ...

వెట‌ర‌న్‌ల‌కు వెండి తెర స్వాగ‌తం

క్రికెట్‌లో వెట‌రన్ అనే మాట ఎక్కువ‌గా వాడుతుంటారు. ఆటగాడిగా రిటైర్ అయిపోయిన త‌ర‌వాత‌.. వాళ్లంతా వ్య‌క్తిగ‌త జీవితాల‌కు ప‌రిమితం అయ్యేవారు. ఇప్పుడు ఐపీఎల్ వ‌చ్చింది. దాంతో రిటైర్ ఆట‌గాళ్లంతా కోచ్‌లుగా, మెంట‌ర్లుగా మారుతున్నారు....

అందర్నీ గొడ్డలితో నరికేసి సింగిల్ ప్లేయర్ అవ్వండి – భారతికి షర్మిల సలహా

వైఎస్ జగన్, ఆయన సతీమణిపై వైఎస్ షర్మిలారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బధవారం మీడియాతో మాట్లాడిన షర్మిల వైసీపీ వాళ్లే అధికారంలో ఉండాలి... వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వారందర్నీ...

విజ‌య్ సినిమాల‌కు టైటిళ్లు కావ‌లెను!

రేపు.. అంటే మే 9న విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా విజయ్ కొత్త సినిమాల సంగ‌తులు రేపే రివీల్ కాబోతున్నాయి. మైత్రీ మూవీస్ లో విజ‌య్ ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close