యూరీ ఉగ్ర దాడులపై మోడీ స్పందన బేష్!

కాశ్మీర్ లో యూరీపై ఉగ్రవాదులు దాడులు చేసి 18 మంది సైనికులని పొట్టన పెట్టుకొన్నాక అందుకు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఏమాత్రం బాధ పడలేదు. కాశ్మీర్ లో జరుగుతున్న హింసకి ప్రతీకారంగా జరిగిన సంఘటన అది అని అన్నారు. తద్వారా భారత్ చేసిన తప్పులకి అదే మూల్యం చెల్లించుకొందన్నట్లుగా మాట్లాడారు. పాకిస్తాన్ పై యుద్దానికి దిగవలసిన భారత్ అ ప్రస్తావన చేయనే లేదు కానీ పాక్ పాలకులు యుద్ధం నుంచి అణుబాంబులు వేయడం వరకు చాలా మాట్లాడేసి తమ యుద్ధోన్మాదాన్ని మరోసారి బయటపెట్టుకొన్నారు.

ఈరోజు కేరళలోని కోజికోడ్ పట్టణంలో జరిగిన భాజపా జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఆ సంఘటన గురించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ పాక్ పాలకులకి పూర్తి భిన్నంగా పాక్ ప్రజల మనసులకి కూడా హత్తుకుపోయే విధంగా చాలా విషయాలు మాట్లాడారు.

ఒకే సమయంలో స్వాతంత్ర్యం పొందిన భారత్ ఇప్పుడు ఏ స్థాయికి చేరుకొందో, ఇప్పుడు పాక్ ఎటువంటి దుస్థితిలో ఉందో చెప్పారు. పాక్ పాలకులు, లోపభూయిష్టమైన వారి విధానాలే అందుకు కారణమని మోడీ చెప్పారు. భారత్ నుంచి నిపుణులైన ఇంజనీర్లు విదేశాలకి వెళ్ళి వాటి అభివృద్ధిలో పాలుపంచుకొంటుంటే, పాకిస్తాన్ ఉగ్రవాదులని తయారుచేసి విదేశాలకి ఎగుమతి చేస్తూ అన్ని చోట్లా విద్వంసం సృష్టిస్తోందని అన్నారు. ఒక్క పాకిస్తాన్ తప్ప మిగిలిన ఆసియా దేశాలన్నీ అభివృద్ధి గురించే ఆలోచిస్తూ ఆ దిశలోనే ముందుకు సాగిపోతున్నాయని అన్నారు. పాక్ మాత్రం ఉగ్రవాదం దగ్గరే ఆగిపోయిందని అన్నారు.

ఇక్కడ మేము మా సైనికులని పోగొట్టుకొని బాధపడుతుంటే, ఉగ్రవాదులుగా మారి ప్రాణాలు పోగొట్టుకొంటున్న మీ బిడ్డల కోసం అక్కడ మీరు బాధపడటం లేదా? అని పాక్ ప్రజల మనసులని కదిలించే ప్రశ్న వేశారు. ఒకప్పుడు అందరూ ఈ భారత్ గడ్డకి నమస్కరించినవారే.. కానీ భారత్ నుంచి పాక్ విడిపోయిన తరువాత పాక్ పాలకులు భారత్ పట్ల విద్వేష వైఖరిని అవలంభిస్తూ తమ దేశాన్నే భ్రష్టు పట్టించారని విమర్శించారు.

పాకిస్తాన్ తన అధీనంలో ఉన్న కాశ్మీర్ నే చక్కదిద్దుకోలేకపోయినా భారత్ లో అంతర్భాగంగా ఉన్న కాశ్మీర్ గురించి అనవసరమైన మాటలు చాలా మాట్లాడుతోందని అన్నారు. భారత్ సహనాన్ని పరీక్షించవద్దని మోడీ పాలకులకి హెచ్చరించారు. కానీ తన ప్రసంగంలో ఎక్కడా పాక్ తో యుద్ధం చేసే ఆలోచన ఉన్నట్లుగా మాట్లాడలేదు. ఆకలి, పేదరికంపై కలిసి యుద్ధం చేద్దామని చెప్పడం ద్వారా నేటికీ పాక్ పట్ల భారత్ కి సానుభూతి ఉందని, అది తన తీరు మార్చుకొంటే దానితో కలిసి పనిచేయడానికి భారత్ కి ఏమీ అభ్యంతరం లేదని మోడీ చెప్పకనే చెప్పారు. పాక్ పాలకులు భారత్ తో యుద్ధం చేసి భారత్ పై అణుబాంబులు వేసి సర్వనాశనం చేస్తామని అనుచితంగా మాట్లాడుతుంటే, మోడీ అభివృద్ధి గురించి మాట్లాడి వారికీ మనదేశానికి ఆలోచనా విధానంలో ఎంత తేడా ఉందో నిరూపించి చూపారని చెప్పవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close